Mana Enadu: ప్రస్తుతం చాలా మంది ఐఫోన్లు వాడేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే యాపిల్ ప్రాడక్ట్స్ కొనే స్తోమత లేని వారు దానికి ఏం తక్కువ కాకుండా అదిరే ఫీచర్లు కలిగిన వన్ ప్లస్ మొబైల్స్ కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అప్ గ్రేడెడ్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా ఫీచర్స్ ఈ ఫోన్ల వైపు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అందుకే ఐఫోన్ తర్వాత ఈ ఫోన్లను ఎక్కువగా వాడేందుకు యూజర్స్ ఇష్టపడుతున్నారు.

అయితే గత కొంతకాలంగా వన్ ప్లస్ యూజర్స్ ఓ సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ ఫోన్ అప్‌డేట్ చేసిన తర్వాత కొన్ని వన్‌ప్లస్ ఫోన్లలో గ్రీన్ లైన్, బ్లూ లైన్ వస్తున్నాయి. దీంతో యూజర్స్ టెన్షన్ పడుతున్నారు. వెంటనే వన్ ప్లస్ స్టోర్లకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి గత ఏడాది నుంచి వన్‌ప్లస్ 10ఆర్ మొబైళ్లపై కంపెనీ వోచర్‌ను అందిస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా ఈ కంపెనీ లైఫ్‌టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్‌గ్రేడ్ ఆప్షన్‌ను ఇస్తోంది. ఇది చాలా మంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది.
వన్‌ప్లస్ 8 ప్రో, వన్‌ప్లస్ 8టీ, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్ వినియోగిస్తున్నవారి ఫోన్లలో అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్, బ్లూ లైన్లు కనిపిస్తే.. వారు వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఉచితంగా స్క్రీన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే క్లీనింగ్, మెయింటెనెన్స్ వంటి సేవలు కూడా ఫ్రీగా పొందొచ్చు. వన్‌ప్లస్ స్టోర్ యాప్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందొచ్చు.
మొదట యాప్‌లో రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్‌షిప్ సెక్షన్‌కు వెళ్లి.. బెనిఫిట్స్ కింద లైఫ్‌టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్‌గ్రేడ్‌ను సెర్చ్ చేసి ఆఫర్‌ను క్లెయిం చేసుకోవాలి. ఫోన్ కొన్న ఒరిజినల్ బిల్లు మాత్రం తప్పక ఉండాల్సిందేనండోయ్. అది లేకపోతే ఆఫర్ పొందలేరు. క్లెయిం చేసుకున్న తర్వాత దగ్గర్లోని వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి స్క్రీన్ అప్‌గ్రేడ్ చేయించుకోవచ్చు. మీరు వన్ ప్లస్ యూజర్ అయితే మీకూ ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే ఇది ఫాలో అయిపోండి.






