Mana Enadu: ఫిల్మ్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తే. ముఖ్యంగా వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే మీడియాలో వారి గురించి వచ్చే న్యూస్ ను ఆసక్తిగా గమనిస్తుంటారు. ముఖ్యంగా వారి రిలేషన్ షిప్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక వారి బ్రేకప్, డివోర్స్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చ అంతా ఇంతా కాదు. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి కూడా చర్చ నడుస్తోంది.

ఈ జంట విడాకులు తీసుకున్నారని చాలా కాలం నుంచి పుకార్లు వస్తున్నాయి. ఈ మధ్య ఈ ఇద్దరు కలిసి కనిపించకపోవడంతో ఇప్పటికే వీళ్లు వేర్వేరుగా జీవిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ జంట గానీ, అమితాబ్ కుటుంబంగానీ ఈ వార్తలను ఖండించలేదు. మరోవైపు జులైలో జరిగిన అనంత్ అంబానీ – రాధిక పెళ్లికి అభిషేక్ తన కుటుంబంతో రాగా, ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. ఇద్దరూ సపరేట్ గా రావడంతో 17 ఏళ్ల వైవాహిక బంధానికి అభిషేక్, ఐశ్వర్య గుడ్ బై చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి.
ఈ పుకార్లు వైరల్ అవుతున్న సమయంలో బచ్చన్ ఫ్యామిలీ నుంచి మరో విషయం బయటకు వచ్చింది. ఈ కుటుంబంలో మరో బ్రేకప్ జరిగిందట. అమితాబ్ మనవరాలు (కుమార్తె శ్వేత బచ్చన్ కూతురు) నవ్య నవేలి నందా, బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది డేటింగ్ లో ఉన్నారని గత కొంత కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట విడిపోయినట్లు సమాచారం. ప్రేమికులుగా విడిపోయినా స్నేహితులుగా ఉంటామని సన్నిహితుల దగ్గర వారు చెప్పినట్లు తెలిసింది.

ఇక నవ్య మిగతా స్టార్ కిడ్స్ లా సినిమాల్లోకి రాలేదు. ఈమె కాస్త డిఫరెంట్ గా సామాజిక స్పృహ కలిగిన ఈవెంట్స్ నిర్వహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లింగ సమానత్వం ప్రోత్సహించే సంస్థ ప్రాజెక్ట్ నవేలిని నిర్వహిస్తోంది. మరోవైపు వాట్ ది హెల్ నవ్య అనే పాడ్ కాస్ట్‌ను కూడా నడుపుతోంది. ఇక సిద్ధాంత్ చతుర్వేది ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. తాజాగా ధడక్ 2లో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీతో కలిసి నటిస్తున్నాడు.






