Mechanic Rocky : మంగ్లీ మ్యాజికల్ వాయిస్.. విశ్వక్ సేన్ అదిరే స్టెప్పులు.. గుల్లెడు గుల్లెడు లిరికల్ సాంగ్ రిలీజ్

Mana Enadu:’గుల్లెడు గుల్లెడు గులాబీలు గుప్పె పిల్లడే.. ఇంక నాతో ఉంటడే…. నా పైట కొంగు పాడుగానూ నిన్నే కోరెనే.. నీకు గులామైతిలే’ అంటూ మంగ్లీ తన మ్యాజిక్ వాయిస్ తో పాడుతుంటే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అదిరిపోయే స్టెప్పులతో అలరిస్తుంటే.. మీనాక్షీ చౌదరి తన అందమైన గ్రేస్ తో ఆడిపాడుతుంటే.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు కదూ. విశ్వక్‌సేన్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం మెకానిక్‌ రాకీలో తాజాగా రిలీజ్ అయిన గుల్లెడు గుల్లెడు సాంగ్ లిరికల్ వీడియో చూస్తుంటే అచ్చం అలాగే అనిపిస్తోంది. 

 రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న మెకానిక్‌ రాకీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మాన్‌సూన్‌ మ్యూజిక్‌ ప్లే లిస్టు నుంచి గుల్లెడు గుల్లెడు సాంగ్‌ లిరికల్ వీడియోను విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ సంగీత దర్శకత్వంలో మంగ్లీ పాడిన ఈ పాట అదిరిపోయింది. విడుదలైన క్షణాల్లోనే ఈ పాటకు తెగ లైకులు వచ్చేశాయి. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్నారు. 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *