Mana Enadu:యాంకర్ సుమ కనకాల.. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని ఇల్లు లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు సుమ అంటే అభిమానం. సుమక్క అని కొందరు ప్రేమగా పిలిస్తే.. సుమ గారు అంటూ ఇంకొందరు గౌరవంతో అభిమానం చూపిస్తారు. ఏ ఛానల్ పెట్టినా.. సుమ.. ఏ ఈవెంట్ చూసినా.. సుమ.. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా.. సుమ.. ఇలా 360 డిగ్రీస్ లో ఎక్కడ చూసినా సుమ కనిపిస్తుంది. ఈమె చుట్టు వివాదాలు దాదాపుగా ఉండవు. కానీ ఈ మధ్య సుమ కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది.
తాజాగా యాంకర్ సుమ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన కమర్షియల్ యాడ్ లో నటించడం ఈ వివాదానికి కారణం. ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసిందని వార్తలు రావడంతో బాధితులు షాకయ్యారు. సుమ నటించిన యాడ్ చూసే ఫ్లాట్స్ కొన్నామని బాధితులు ఆరోపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొందరు బాధితులైతే ఏకంగా సుమకు లీగల్ నోటీసులు పంపినట్లు తంలిసింది.
ఈ నేపథ్యంలోనే సుమ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి బ్రేక్ ఇచ్చింది. కంపెనీ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అయితే రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి యాడ్ నెట్టింట వైరల్ అవుతోందని.. ఆ యాడ్ తాను కొన్నేళ్ల క్రితం చేసిందని చెప్పుకొచ్చింది. ఈ యాడ్‌ను 2016 నుంచి 2018 వరకే టెలికాస్ట్ చేసేలా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నానని.. కానీ, తన అనుమతి లేకుండా ఇంకా ఆ యాడ్‌ను ప్రదర్శించారని సుమ క్లారిటీ ఇచ్చారు.
దీంతో కొందరు బాధితులు తనకు లీగల్ నోటీసులు పంపడంతో వారికి సమాధానమిచ్చానని తెలిపింది. ఆ సంస్థకు కూడా నోటీసులు పంపినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ.. అధికారిక ఛానల్స్‌లో వచ్చే యాడ్స్, ప్రమోషన్స్‌లోనే కచ్చితమైన సమాచారం ఉంటుందని.. అది చూసి కన్ఫమ్ చేసుకున్న తర్వాతే పర్చేజ్ చేయాలని సూచించింది.







