మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), డైరెక్టర్ హరీశ్ శంకర్(Harsh Shankar) డైరెక్షన్లో రాబోతున్న చిత్రం మిస్టర్ బచ్చన్(Mr.Bacchan). పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్, ధమాకా ప్లస్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోందీ మూవీ. ఈ మూవీలో రవితేజకు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఈ ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవనుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ టి.జి. విశ్వప్రసాద్(TG Vishwa Prasad)పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ షేర్ చేసుకున్నారు.
రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ క్రేజీగా ఉందన్నారు విశ్వప్రసాద్. గత కొంత కాలంగా హరీశ్‌తో ట్రావెల్ చేస్తున్నామని చెప్పిన ఈ నిర్మాత మిస్టర్ బచ్చన్ మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పారు. ఎంటర్ టైన్మెంట్, మాస్, యాక్షన్ ఓ రేంజ్లో ఉంటాయని చెప్పేశారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు మే, జూన్‌లోనే షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నామని, కానీ సాంగ్స్ షూటింగ్ కాస్త ఆలస్యం అవడంతో రిలీజ్ డేట్ కాస్త లేటయిందన్నారు.
* తొలుత ఆగస్టు 9నే అనుకున్నాం..
మూవీని తొలుత ఆగస్టు 9వ తేదీనే రిలీజ్ చేయాలనుకున్నారట మూవీ టీమ్. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప-2 స్లాట్ క్లియర్ అవడంతో ఆగస్టు 15కి ప్లాన్ చేసినట్లు చెప్పారు మూవీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. అనుకున్న బడ్జెట్లోనే మూవీ కంప్లీట్ చేశామని, మూవీ పక్కా బంపర్ హిట్ అవుతుందని చెప్పారు. ఇక ఫ్యూచర్లోనూ రవితేజ, హరీశ్ శంకర్ కాంబోలో మూవీస్ వస్తాయని క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్.
* రన్నింగ్‌లో ఐదారు సినిమాలు
ఇదిలా ఉండగా వచ్చే అప్కమ్మింగ్ మూవీస్ గురించీ హింట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. మిరాయ్, జీ2, రాజ్ సాబ్ సినిమాలు లైన్లో ఉన్నాయని చెప్పారు. వీటితోపాటు కన్నడలో గణేశ్ అనే యాక్టర్‌తో 50 కోట్ల స్పాన్ ఉన్న మూవీ చేస్తున్నామని చెప్పారు. ఇంకో మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి. తెలుగులోనూ నాలుగైదు సినిమాలున్నాయన్నారు. దీంతోపాటు ఓటీటీలోనూ రిలీజ్ ఓ ఐదు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రొడ్యూసర్. ఇక రాజాసాబ్ షూటింగ్ 50పర్సంట్ పూర్తయిందని న్యూ అప్డేట్ ఇచ్చారు.






