Committee Kurrollu: ప్రొడ్యూసర్‌గా నిహారిక ఫ‌స్ట్ మూవీ.. ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్ తెలుసా?

Mana Enadu:యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌‌గా తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రోళ్లు(Committee Kurrollu). మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Kondiela) పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీ తెరకెక్కింది. నూత‌న దర్శకుడు య‌దు వంశీ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నటీనటులుగా సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పాపులర్ అయిన సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వీ రావు, టీన శ్రావ్య, విశిక, షణ్ముఖి నాగుమంత్రీ, సాయి కుమార్, రమణ రాజు గోపరాజు, కిశోర్ కుమార్‌ తదితరులను మెయిన్ లీడ్స్‌గా తీసుకొని ఈ సినిమా నిర్మించిన తీరు ఆకట్టుకుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో అంచ‌నాల‌ను పెంచేసిన ఈ మూవీ ఆగస్టు 9న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

 15 మంది నటీనటుల తెరంగేట్రం

ఇక ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌(Positive Response)ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తోపాటు యువతను బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్సాఫీస్(Box Office) వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలిరోజు(Collection Day1) ఈ మూవీ ఏకంగా రూ.1.63 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వీరికి తొలి చిత్రమే అయినా తమ అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించారు. కాగా వీకెండ్ కావడంతో ఈ మూవీ క‌లెక్షన్లు మ‌రింతగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు.

 మూవీ స్టోరీ ఏంటంటే..

ఒక ఊరిలో కొంతమంది స్నేహితులు ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఆ ఊళ్లో 12 ఏళ్లకు ఒకసారి బరింకలమ్మ జాతర జరుగుతుంది. ఫ్రెండ్స్ అంతా ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక విషయంలో వాళ్ళల్లో వాళ్లకు గొడవలు వచ్చి విడిపోతారు. ఆ గొడవలతో ఆ సంవత్సరం జాతరలో గొడవలు అవ్వడం, వీరిలో ఒకరు చనిపోవడం. దీంతో ఫ్రెండ్స్ అంతా విడిపోయి ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉంటారు.
మళ్లీ అదే జాతరకు ఫ్రెండ్స్ అంతా ఊరికి రావడం, జాతరలో ఓ సమస్య ఉండటం, అదే సమయంలో ఊరి పంచాయితీ ఎన్నికలు ఉండటం జరుగుతాయి. మరి ఈ ఫ్రెండ్స్ మధ్య అసలు గొడవలు ఎందుకొచ్చాయి, వీరంతా చివరకు కలిశారా? ఆ ఊరి జాతరని జరిపించారా? ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

Share post:

లేటెస్ట్