అనాథ అడవికి రాజు ఎలా అయ్యాడు?.. ముఫాసా ది లయన్ కింగ్ ట్రైలర్ వచ్చేసింది

Mana Enadu:సాధారణంగా చిన్న పిల్లలు డిస్నీ ప్రిన్స్, ప్రిన్సెస్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందులోనూ లయన్ కింగ్ చిత్రాలంటే ఇక టీవీ ముందు నుంచి అస్సలు కదలరు. ది లయన్ కింగ్ మూవీ ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీకి ప్రీక్వెల్గా ముఫాసా – ది లయన్ కింగ్ పేరుతో ఓ చిత్రం వస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.

ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్‌, టిఫానీ బూనే, కగిసో లేడిగా, ప్రెస్టన్ నైమన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ముఫాసా: ది లయన్‌ కింగ్‌ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ప్రీక్వెల్‌ను బేరీ జెంకిన్స్‌ తెరకెక్కిస్తున్నారు. అనాథగా మారిన ముఫాసా అడవికి రాజు ఎలా అయ్యాడన్న కథతో ఈ చిత్రం వస్తోంది. ఇందులో ముఫాసా, టాకాల మధ్య అన్నదమ్ముల సంబంధాన్ని బాగా ఎలివేట్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ఏడాదిలో క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ముఫాసా: ది లయన్‌ కింగ్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ది లయన్ కింగ్లో ఏం జరిగింది.?
ది లయన్ కింగ్ మూవీలో ముఫాసాను తన తమ్ముడు స్కార్ అంతమొందిస్తాడు. తమ్ముడి కుట్రకు అడవికి రాజైన ముఫాసా మరణిస్తాడు. ఇక ముఫాసా తనయుడు అయిన సింబా.. ఈ విషయం తెలుసుకుని తన బాబాయ్ స్కార్ను రాజ్యం నుంచి తరిమేసి ముఫాసా వారసుడిగా.. సింబా మళ్లీ అడవికి రాజు అవుతాడు. అలా ఆ చిత్రానికి శుభం కార్డు పడిపోతుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *