పండోర గ్రహానికి వెళ్లేందుకు రెడీయా? .. ‘అవతార్‌ 3’ టైటిల్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Mana Enadu:హాలీవుడ్​లో ప్రపంచం మెచ్చిన సినిమాల్లో మార్వెల్, డీసీ చిత్రాలు కాకుండా అత్యంత ఆదరణ పొందిన సినిమాల్లో అవతార్ సిరీస్ ముందు స్థానంలో ఉంటుంది. డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్స్ట్​తో చూపించి అద్భుతం చేశారు. ఆ అద్భుతానికి యావత్ సినీ ప్రపంచం అబ్బురపడింది. అలా అవతార్, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మూవీ లవర్స్​కు మంచి మ్యాజికల్ ట్రీట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు కలెక్షన్ల సునామీ సృష్టించాయి.

అయితే ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు మూడో భాగం కూడా వస్తోంది. ఇప్పటికే పార్ట్-3 పనులు కూడా షురూ అయ్యాయి. తాజాగా మేకర్స్ అవతార్-3 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూడో భాగం టైటిల్, కాన్సెప్ట్​తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 19వ తేదీన ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.

మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నట్లు చెప్పారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక ఈ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్‌ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు జేమ్స్ కామెరూన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *