Mana Enadu:వీకెండ్ వచ్చేసింది. మరి ఈ వీకెండ్‌ను బయటకెళ్లి జాలీగా ఎంజాయ్ చేద్దామంటే వర్షాలు పడుతున్నాయి. ఇక ఇంట్లోనే హాయిగా వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా..? మీ కోసమే అదిరిపోయే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేశాయి. రొమాన్స్, కామెడీ, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని రకాల జానర్లో ప్రేక్షకులను అలరించేందుకు కంటెంట్ రెడీగా ఉంది. అయితే మీకు కావాల్సిన జానర్లో తెలుగులో ఉన్న ది మోస్ట్ ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్‌ల గురించిమీకు తెలుసా..? గంటల తరబడి ఏం చూడాలా అని వెతకకుండా ఈ స్టోరీ చదివేయండి.. మీకు నచ్చిన జానర్లో ఓ సినిమానో, లేక వెబ్ సిరీస్నో ఎంపిక చేసుకుని ఈ వీకెండ్‌ను జాలీగా గడపండి.
కుమారి శ్రీమతి: నిత్యా మీనన్ హీరోయిన్గా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నటించిన డ్రామా కుమారి శ్రీమతి (2023 రిలీజ్). ఇందులో కార్తీకదీపం ఫేమ్ డాక్టర్ బాబు అదేనండి నిరుపమ్ పరిటాల ప్రధాన పాత్రలో నటించాడు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. నిత్యా మీనన్ పర్ఫామెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫ్యామిలీతో కలిసి జాలీగా ఈ సిరీస్ ఎంజాయ్ చేయొచ్చు.
మోడ్రన్ లవ్ హైదరాబాద్: ఈ వెబ్ సిరీస్ ( జూలై 2022 రిలీజ్) ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధనం ఆరు కథలతో డైరెక్ట్ చేసిన ఆంథాలజీ ఇది. ఇందులో నిత్యా మీనన్, రేవతి, సుహాసిని మణిరత్నం, మాళవికా నాయర్, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించారు.
హాస్టల్ డేస్: ఆదిత్య మండల దర్శకత్వంలో వచ్చిన హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ 2023లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఇందులో దరహాస్ మాటూరు, అక్షయ్ లగుసాని, మౌళి తనూజ్ ప్రశాంత్, ఐశ్యర్య హోల్లకల్, జైత్రీ మకానాలు ప్రధాన ప్రాత్రల్లో నటించారు. ప్రస్తుతం ప్రైమ్‌లో టాప్ మోస్ట్ వెబ్ సిరీస్‌గా ఉంది.
ధూత: నాగ చైతన్య- ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ ధూత. సాగర్ అనే జర్నలిస్టు పాత్రలో నాగచైతన్య నటించారు. డిసెంబర్ 2023లో విడుదలైన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
గ్యాంగ్ స్టార్స్: సినీ పరిశ్రమ నేపథ్యానికి వ్యతిరేకంగా 2018లో విడుదలైన వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్స్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అజయ్ భూయాన్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఇద్దరు సినీ తారలు, ఇద్దరు మాజీ ప్రేమికులు, ఒ గ్యాంగ్‌స్టర్ జీవితాల చుట్టూ తిరుగుతుంది.