వచ్చాడయ్యా సామీ.. నాగచైతన్య-శోభిత పెళ్లిపై వేణుస్వామి ఏమన్నారంటే?

Mana Enadu:వేణుస్వామి.. ఈ పేరు తెలియని వారుండరు. ఈయన వృత్తిపరంగా జ్యోతిష్యుడు. తరచూ సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల జాతకాలు చెప్పి కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే కొన్నిసార్లు ఆయన జాతకాలు తప్పు కావడంతో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ట్రోల్స్ తట్టుకోలేక ఇంక లైఫ్ లో ఎవరి జాతకం చెప్పనని ప్రకటించారు.

అయితే వృత్తిరీత్యా జ్యోతిష్యుడు కావడంతో ఆయన అలవాటు పోనట్టుగా ఉంది. తాజాగా నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య- శోభిత ధూళిపాళ గురించి వేణుస్వామి సంచలన కామెంట్లు చేశారు. ఈ జంట జాతకం కలవలేదని.. వీళ్ల వివాహం కరెక్టు కాదని ఆయన జాతకం చెప్పారు. నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంట కొంతకాలం కలిసి ఉంటుందని.. కానీ 2027లో ఓ అమ్మాయి వల్ల విడిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో తన జ్యోతిష్యం తప్పు కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. 

ఇక వేణుస్వామిపై మరోసారి ట్రోలర్లు విరుచుకుపడ్డారు. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే.. ఇలా మాట్లాడతారేంటి అంటూ మండిపడుతున్నారు. అసలు మిమ్మల్ని జాతకం చెప్పమని అడిగింది ఎవరయ్యా అంటూ ఫైర్ అవుతున్నారు. సెలబ్రిటీల ప్రైవేట్ వ్యక్తుల జీవితాలపై మీకెందుకు అంత ఆసక్తి అంటూ ధ్వజమెత్తుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో వేణుస్వామి కామెంట్స్ మామూలుగా రచ్చ చేయడం లేదు. 

 

Share post:

లేటెస్ట్