సినిమాలకు స్టార్‌ హీరో బ్రేక్!.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్!

Mana Enadu:కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ను అభిమానులు తల అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. ఆయన పుట్టిన రోజుకు రక్తదానాలు, దానధర్మాలు, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన సినిమా రిలీజ్ సమయంలో హంగామా మామూలుగా ఉండదు. ఇక కథ ఎలా ఉన్నా.. ఏ జానర్ మూవీ అయినా మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అజిత్ సినిమా వస్తుందంటే అభిమానులు పండుగ చేసుకుంటారు.

అలాంటిది దేవుడిలా భావించే తమ హీరో తీసుకున్న తాజా నిర్ణయంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో మంది అభిమానుల హార్ట్ ను బ్రేక్ చేసింది. ఇంతకీ ఆయన తీసుకున్న డెసిషెన్ ఏంటంటే.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయ్యాక ఆయన కొంతకాలం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నారట. 

ప్రస్తుతం అజిత్..  ‘విదా ముయార్చి’, ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే రెండు సినిమాలతో  ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘విదా ముయార్చి’. ఇందులో త్రిష కథానాయిక.  ఈ రెండు మూవీస్ తర్వాత ఈ స్టార్‌ హీరో కొన్ని నెలలు సినిమాలకు విరామం    ప్రకటించనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు ఆరు నెలల పాటు ఆయన తన కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లనున్నారట. అజిత్ కు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని తెలిసిందే. మరోవైపు ఆయన ఫార్ములా 1 రేసర్ కూడా. ఆరు నెలల పాటు అజిత్ బ్రేక్ తీసుకుంటాడనే వార్త తెలిసిన అభిమానులు నిరాశ చెందుతున్నారు. అజిత్ ఇలా షాకిచ్చాడేంటని హార్ట్ బ్రేక్ అయ్యిందంటూ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.  

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *