ManaEnadu:కోల్‌కతాలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో ఓవైపు సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై బెంగాల్ ప్రభుత్వం సిట్ దర్యాప్తును ఆదేశించిన విషయం తెలసిందే. ఈ క్రమంలో సందీప్ ఘోష్ అవినీతిపై సిట్ అధికారులకు సంచలన విషయాలు తెలుస్తున్నట్లు సమాచారం. చివరకు అనాథ శవాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని, మరోవైపు బంగ్లాదేశ్‌కు అక్రమంగా ఔషధాలు ఎగుమతి చేసే వాడని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. వాడేసిన సిరంజులు, ఇతర మెడికల్ వేస్ట్‌ను రీసైక్లింగ్ చేసి సొమ్ముచేసుకునే వాడిని తెలిసింది.
వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్జీ కార్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అవినీతి అంతాఇంతా కాదని తెలుస్తోంది. చివరికి అనాధ శవాలను కూడా సందీప్ ఘోష్ విక్రయించేవాడని, బంగ్లాదేశ్‌కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవాడని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజులు, ఇతర సామగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకొనేవాడని తెలిసింది. ఇదే కాలేజీలో పని చేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సుపరింటెండెంట్‌గా ఉన్న అక్తర్ అలీ గతంలోనే సందీప్ ఘోష్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
తాజాగా సందీప్ ఘోష్‌పై ఏర్పాటైన సిట్ ఇటీవల అక్తర్‌ను విచారణకు పిలవడంతో ఆయన సంచలన విషయాలను అధికారులు తెలిపారు. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్త్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకు ఇచ్చేవాడని సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకొనేవాడని ఆరోపణలు వచ్చాయి.








