Gabbar Singh Re-Release: అరేయ్ సాంబ రాస్కో రా.. ‘గబ్బర్ సింగ్’ వచ్చేది ఆరోజే!

Mana Enadu: ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’ అంటూ అభిమానులను అలరించిన నటుడు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan). గబ్బర్ సింగ్(Gabbar Singh) మూవీతో అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేశాడు పవన్. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మేనరిజమ్స్, డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్(Harish Shankar) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్(Box office) వద్ద భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. 2012లో వచ్చిన ఈ మూవీ దంబాగ్ మూవీకి రీమేక్‌గా తీసిన ఈ చిత్రం టాలీవుడ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అటు పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్(Shruthi Hasan) హీరోయిన్‌గా నటించారు. కమెడియన్ ఆలీ(Ali) కీలక పాత్ర పోషించారు. దేవీశ్రీ ప్రసాద్(Devisri prasad) ఇచ్చిన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

 సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ట్రైలర్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తూ.. వారి హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ బర్త్ డే(Birth Day) సందర్భంగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన గబ్బర్ సింగ్ 4K Trailer మెగా ఫ్యాన్స్‌కు తెగ ఆకట్టుకుంటోంది. నాగబాబు(Nagababu) గబ్బర్ సింగ్ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. మరోవైపు అభిమానులు ముందుస్తుగా టికెట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిలీజ్‌కు ఐదు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.కోటి దాటినట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు ఆయా థియేటర్ల వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. కాగా.. ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, మెగాస్టార్ చిరంజీవిల బర్త్ డే సందర్భంగా మురారి, డార్లింగ్,ఈశ్వర్, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలను రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

మూవీలో మాస్ డైలాగ్స్ గుర్తున్నాయా..

ఇదిలా ఉండగా పవన్ నటించిన గబ్బర్ సింగ్ మూవీలో మాస్ డైలాగ్స్ ఇప్పటికీ అభిమానులను సోషల్ మీడియాలో అలరిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని డైలాగ్స్ మీకోసం.. ‘‘నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేదు, ఎందుకంటే సిద్ధప్ప నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’’, ‘‘పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైన గుడికొచ్చానా ఏంట్రా? తెలుసుకోవడాల్లేవ్.. తెల్చుకోడాలే’’, అరేయ్ సాంబ రాస్కో రా..రాసుకోవాలా ఏమి రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు అనిముత్యాలు వచ్చేస్తాయి అవ్వి నువ్వు రాస్కోవాలి రా’’,‘‘ డైలాగ్‌లు చెప్పడం కాదు రోయి,చెపిన దాని మీద నిలబడాలి, నిలబడ్డా చూపించాలి’’, ‘‘నేను సమయం నీ నమ్మను నా టైమింగ్‌ని నమ్ముతాను’’. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ గబ్బర్ సింగ్ రీరిలీజ్‌ను చూసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *