ManaEnadu:టాలీవుడ్ టైర్-2 హీరోల్లో యంగ్ నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu) ఒకరు. ఆయన సగటు కమర్షియల్ హీరోలా ఎప్పుడూ సినిమాలు చేయరు. తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. వెరైటీ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తారు. అందుకే శ్రీవిష్ణు సినిమా రిలీజ్ అవుతుందంటే మినిమమ్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని థియేటర్లకు వెళ్తుంటారు. ఇక ఆయన సినిమాల్లో కామెడీ ప్రధానంగా ఉంటుంది. అది కూడా వల్గర్ గా కాకుండా కుటుంబ ప్రేక్షకులతో కలిసి చూసేలా ఈయన సినిమాలుంటాయి.
ఇక సామజవరగమన, ఓం భూమ్ బుష్ (Om Bhoom Bush) సినిమాలతో హిట్ కొట్టిన శ్రీవిష్ణు తాజాగా మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజరాజచోర సినిమాతో తన కెరీర్ లో బెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు హసిత్ గోలి (Hasith Goli) డైరెక్షన్ లో శ్రీవిష్ణు ‘స్వాగ్ (SWAG Teaser)’ అనే సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే గ్లింప్స్ తో హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లో రాజుల కాలం, ప్రస్తుతం, భవిష్యత్ ఇలా మూడు కాలాలకు సంబంధించి ఆడవాళ్లు, పురుషులు మేమంటే మేమే గొప్ప అనుకునే రెండు వంశాల మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో వస్తున్న సినిమాలా కనిపిస్తోంది. ‘ఏడుసార్లు పుట్టిన పిల్లలు కనీసం నామకరణం అవ్వకముందే గిట్టారు.. ఈసారీ మగపిల్లాడే పుడితే’ అనే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభం అయింది.

‘ఆడవాళ్లంటేనే…. ఆ…డ..వాళ్లని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ టీజర్ కు హైలైట్ గా నిలిచింది. ‘వైఫ్ ఆఫ్, డాటర్ ఆఫ్ అని మగాళ్లతోనే లింకేసుకోవాలా?.. మాకంటూ ఒక ఐడెంటిటీ అక్కర్లేదా?’ అంటూ హీరోయిన్ పలికిన సంభాషణ అదిరిపోయింది. ఇక ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రీతూ వర్మ (Ritu Varma) నటిస్తోంది. మీరాజాస్మిన్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో శ్రీవిష్ణు నాలుగు పాత్రల్లో అలరించబోతున్నారు. శ్రీవిష్ణుతో పాటు రీతువర్మ కూడా కాలానికి తగ్గట్టు పాత్రలు వేసినట్టు టీజర్ లో కనిపిస్తోంది. ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ టీజర్ మీరూ చూసేయండి మరి.






