Mana Enadu: బుల్లితెర రియాలిటీ షో Bigg Boss 8 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు సరికొత్త సీజన్ తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ షోపై తెలుగు రాష్ట్రాల్లో భారీ హైప్ నెలకొంది. బుల్లిరెత ప్రేక్షకులంతా ప్రస్తుతం దీని గురించే డిస్కస్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఎన్ని గంటలకు ప్రసారమవుతుంది, ఎవరెవరు కంటెస్టెంట్స్(Contestants)గా రాబోతున్నారు, ఆరంభం రోజు ఎవరెవరు గెస్ట్‌లుగా వస్తున్నారు? ఇలా ప్రేక్షకుల బుర్రలను అనేక సందేహాలు తొలిచేస్తున్నాయి. ఇప్పటికే ఈ షోకి సంబంధించి హోస్ట్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ షో సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. కంటెంటెంట్స్ ఎవరో అదే రోజు తెలియనుంది. ఇదిలా ఉండగా స్టార్ మా(Star Maa) ఛానల్‌లో ప్రసారం కానున్న బిగ్ బాస్ షోలోకి ఎవరెవరు వెళ్తారని కొన్ని రోజులుగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు అఫీషియల్‌గా మాత్రం పలానా వ్యక్తి అని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ కొందరి పేర్లు మాత్రం వీరే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లేదంటూ తరచూ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు వాళ్లు.. తెలుసుకుందాం పదండి.
హౌస్‌లోకి వెళ్లేది వీరేనా..
▶ సీరియల్స్, TV షోలు, యాంకర్ రీతూ చౌదరి
▶ యాంకర్ విష్ణుప్రియ
▶ సోషల్ మీడియా ఫేమ్ కుమారి ఆంటీ
▶ నటుడు ఆదిత్య ఓం
▶ సీరియల్ నటి యాష్మి గౌడ
▶ సీరియల్ నటుడు నిఖిల్
▶ యాంకర్, కమెడియన్ బెజవాడ బేబక్క అలియాస్ సింగర్ మధు
▶ నటుడు అభయ్ నవీన్
▶ అలీ తమ్ముడు ఖయ్యుమ్
▶ ఆర్జే శేఖర్ భాష
▶ నటి సహర్ కృష్ణన్
▶ ఢీ డ్యాన్సర్ నైనిక
▶ నటి సోనియా ఆకుల
▶ జబర్దస్త్ ఫేమ్ యాదమ్మ రాజు
▶ నటి రేఖ భోజ్
▶ సింగర్ సాకేత్
▶ ఓ సెలబ్రిటీ కపుల్ ఉన్నారని టాక్. అయితే తుది జాబితాలో వీరిలో ఎంతమంది ఉంటారో చూడాలి మరి.