50 Years ఇండస్ట్రీ ఇక్కడ.. బాలయ్య సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలివే

ManaEnadu:‘నాకొకడు ఎదురు వచ్చినా వాడికే రిస్కు.. నేనొకడికి ఎదురెళ్లినా వాడికే రిస్కు’ అంటూ విలన్ గుండెల్లో దడ పుట్టించేలా డైలాగ్ చెప్పాలన్నా.. ‘ఒక్కసారి మావయ్యా అని పిలవమ్మా’ అని ఎమోషనల్ సీన్స్​లో ప్రేక్షకుల చేతి కంటతడి పెట్టించాలన్నా నందమూరి నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna)కే సాధ్యం. పేజీలకు పేజీల డైలాగులను అవలీలగా సింగిల్ టేకులో చెప్పేయగల సత్తా ఉన్న ఏకైక నటుడు బాలయ్య. మాస్ అవతార్​లో విలన్ల మక్కెలిరగ్గొట్టాలన్నా.. క్లాస్ కథలతో ప్రేక్షకులను మెప్పించాలన్నా.. సాంఘీక చిత్రాలతో సమాజానికి సందేశాలివ్వాలన్నా.. ఖడ్గం చేతపట్టి రాజసాన్ని ప్రదర్శించాలన్నా.. తొడగొట్టి మీసం మెలేస్తూ ఫ్యాక్షన్​ను తెలుగు తెరపైకి తీసుకురావాలన్నా.. పౌరాణిక గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు.. కమర్షియల్ సినిమాలు, హృదయాలను హత్తుకునే చిత్రాలు ఇలా ఏది చేయాలన్నా టాలీవుడ్ (Tollywood)​లో కేరాఫ్ అడ్రెస్ బాలయ్య బాబు.

50 ఏళ్ల నటరాజసం

ప్రయోగాలకు పెట్టిన పేరు.. ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు.. మన బాలయ్య. అందుకే చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు తెరపై ఆయన కనిపిస్తే జై బాలయ్య (Jai Balayya) అంటు సంబురపడిపోతారు. బాలకృష్ణను తమలో ఒకడిగా భావిస్తుంటారు. టాలీవుడ్​లో ఇంతటి క్రేజ్ ఏ సినీ నటుడికి లేదనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు తన సినిమాలు వంద రోజులు, 200 డేస్, సిల్వర్ జూబ్లీలు, వెయ్యి రోజుల సంబురాలు కూడా చేసుకున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఆయనే 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని స్వర్ణోత్సవం (Balakrishna Silver Jubilee) జరుపుకుంటున్నారు.

తండ్రికి తగ్గ తనయుడు

నందమూరి తారకరామా రావు (NTR) తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నటనలో తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని.. తనకంటూ ఓ స్థాయిని ఏర్పరుచుకున్నారు బాలకృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్రలో ఓ పేజీని తనకోసం ప్రత్యేకంగా లిఖించుకున్నారు. ఇవాళ్టితో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తవుతోంది. ‘తాతమ్మకల (Tatamma Kala)’ చిత్రంతో ఆయన ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లవుతోంది. ‘తాతమ్మ కల’ 1974 ఆగస్టు 30న విడుదలైంది. లెంగ్తీ డైలాగులో చెప్పడంలో బాలయ్యకు సాటిలేరెవరు. వందకుపైగా సినిమాలు చేసి.. వందలాది వేషధారణల్లో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ తర్వాత అన్ని రకాల పాత్రలను పోషించి సంపూర్ణ నటుడిగా నిలిచింది కేవలం బాలకృష్ణ మాత్రమే.

గుర్తుండిపోయే పాత్రలు ఇవే..

భైరవద్వీపం, ఆదిత్య 369 (Aditya 369), మంగమ్మగారి మనవడు, మువ్వగోపాలుడు, బాలగోపాలుడు, శ్రీ కృష్ణార్జునవిజయం, ముద్దలమావయ్య, నిప్పురవ్వ, బంగారుబుల్లోడు, రౌడీ ఇన్స్పెక్టర్, పెద్దన్నయ్య, బోబ్బిలి సింహం,  సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, శ్రీ రామరాజ్యం, పాండురంగుడు, గౌతమిపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ బైయోపిక్ (కథానాయకుడు, మహానాయకుడు), అఖండ, భగవంత్ కేసరి, వీరసింహరెడ్డి, లెజెండ్ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్​టైన్ చేశారు బాలయ్య. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీనిస్తూ ఫైట్లు చేస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Share post:

లేటెస్ట్