గోల్డెన్ ప్యాలెస్.. 7వేల లగ్జరీ కార్లు.. ‘బ్రూనై సుల్తాన్‌’ గురించి మీరు తెలుసుకోవాల్సిందే

ManaEnadu:ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi Brunei Tour Today) మరో విదేశీ పర్యటనకు బయల్దేరారు. బ్రూనై, సింగపూర్ పర్యటనకు ఇవాళ (సెప్టెంబరు 3వతేదీ) బయల్దేరి వెళ్లారు. మొదట బ్రూనైలో మోదీ పర్యటన సాగనుంది. ఆయనకు స్వాగతం పలికేందుకు బ్రూనై దేశ రాజు హసనల్‌ బోల్కియా (The Sultan of Brunei Hassanal Bolkiah,) ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ రాజుకు విలాసపురుషుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. బంగారు ప్యాలెస్‌లో నివసిస్తున్న ఈ రాజుకు 100 కారు గ్యారేజీలు అందులో 7000 కార్లున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో బ్రూనై రాజు లగ్జరీ లైఫ్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రూనై రాజకుటుంబం, ఆ దేశ రాజు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

1700 గదుల లగ్జరీ ప్యాలెస్..

క్వీన్‌ ఎలిజిబెత్‌-2 తర్వాత అత్యధికకాలం పదవిలో ఉన్న పాలకుడిగా బ్రూనై రాజు హసనల్‌ బోల్కియా రికార్డు క్రియేట్ చేశారు. ఇక ఈ సుల్తాన్ మోడర్న్ స్టైల్లో లగ్జరీ ((Brunei Sultan Luxury Life) Style)గా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆయన రాజకుటుంబం సంపద విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందట. బ్రూనైలో చమురు – గ్యాస్ నిల్వలు ఎక్కువ. వాటి నుంచి వచ్చే సొమ్మే ఈ రాజకుటుంబానికి ఆదాయ వనరు అన్నమాట. బ్రూనై సుల్తాన్‌ ఉండే భవనాన్ని గోల్డెన్ ప్యాలెస్ (Brunei Sultan Palace) అంటారు. అతి పెద్ద కోటను తలపించే ఈ రాజభవనంలో 1,700 గదులు ఉంటాయి. 257 బాత్‌రూమ్‌లు, ఐదు స్విమ్మింగ్‌ పూల్స్‌ కలిగి ఉన్న ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌గా గిన్నీస్‌ రికార్డుకెక్కింది. 1984లోనే దీని నిర్మాణానికి 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారని సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్టు తన కథనంలో పేర్కొంది.

7000 కార్లు..

ఇక ఈ దేశ సుల్తాన్‌కు కార్లంటే పిచ్చి. సుల్తాన్‌ ప్యాలెస్‌లో 100 గ్యారేజీలు ఉండగా వాటిలో 7,000 లగ్జరీ కార్లు(Brunei Sultan Cars Collection) న్నాయట. వీటివిలువ 5 బిలియన్‌ డాలర్లకు పైనే ఉంటుందట. వాటిల్లో ప్రపంచంలో మరెవరీ వద్ద లేనంతగా.. 600 రోల్స్‌రాయిస్‌ కార్లు, 450 ఫెరారీ, 380 బెంట్లీ, జాగ్వార్‌, పోర్ష్‌, లంబోర్గిని, బీఎండబ్ల్యూ వంటి టాప్ మోడల్స్ ఉన్నాయి. వీటిల్లో బంగారు పూత పూసిన రోల్స్‌ రాయిస్‌ (Brunei Sultan’s Golden Rolls Royce Car) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రపంచంలో ఉన్న ఏడు ఫెరారీ 456 జీటీ వెన్సీలో ఒకటి సుల్తాన్‌ వద్ద ఉండటం గమనార్హం.

హెయిర్ కట్ కోసం 20 వేల డాలర్లు..

ఇక ఈ సుల్తాన్ లైఫ్ స్టైల్‌ను కూడా చాలా విలాసవంతంగా ఉంటుందట. కేవలం హెయిర్ కట్ (Brunei Sultan Hair Cut) కోసమే దాదాపు రూ.16.5 లక్షలు ఖర్చు పెడతారట. దాని కోసం ఏకంగా 7వేల మైళ్లు తన ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించి లండన్‌లోని ప్రఖ్యాత ది డోర్ చెస్టర్ హోటల్‌ మేఫెయిర్‌లో ఉన్న బార్బర్ వద్ద హెయిర్ కట్ చేయించుకుంటారని 2009లో డెయిలీ మెయిల్ కథనంలో పేర్కొంది. దాదాపు 20వేల డాలర్లు అంటే అక్షరాలా రూ.16.5 లక్షల కటింగ్ కోసమే వెచ్చిస్తారట.

Related Posts

Bonala Jathara 2055: భాగ్యనగరంలో బోనాల జాతర షురూ.. నేడు జగదాంబిక ఎల్లమ్మకు తొలిబోనం

ఆషాఢ మాసం బోనాలు(Bonalu) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రక గోల్కొండ కోట(Golconda Kota)పై వెలిసిన జగదాంబిక ఎల్లమ్మ(Jagadambika Yellamma) ఆలయంలో జరిగే తొలి బోనంతో బోనాల సందడి ప్రారంభం కానుంది. ‘డిల్లం.. బల్లెం.. కుడకలు బెల్లం’ అంటూ ఆదిపరాశక్తి…

Tirumala Updates: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామి(Sri Venkateswara Swamy)వారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) భారీగా తరలివచ్చారు. దీంతో తిరుమల(Tiruala)లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *