ఉప్ప‌ల్ బ‌రిలో తొలిసారి మ‌హిళ‌ల‌కు ఛాన్స్‌..?!

హైద‌రాబాద్ ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన త‌ర్వాత తొలిసారి మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం రాబోతుంది.33శాతం రిజ‌ర్వేష‌న్ మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించే వెసులుబాటు రావ‌డంతో ఉప్ప‌ల్ రాజ‌కీయం చిత్రం ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌నుంది. మూడు సార్లు ఇక్క‌డి ఎన్నికైన ఎమ్మెల్యేలుకు మూడు సార్లు 3పార్టీల‌కు చెందిన వ్య‌క్తుల‌కు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి బండారి రాజిరెడ్డి, 2014లో తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత భార‌తీయ జ‌న‌తాపార్టీ నుంచి ఎన్‌వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్ గెలుపొందారు. ఆ త‌ర్వాత 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ర్ట స‌మితి నుంచి బేతి సుభాష్‌రెడ్డి విజ‌యం సాధించారు.


మ‌ళ్లీ బొంతుకు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే!
చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33శాతం రిజ‌ర్వేష‌న్ బిల్లుతో ఉప్ప‌ల్ బ‌రిలో మ‌హిళ నేత‌ల‌కు అవ‌కాశం వ‌చ్చింది. దీంతో మ‌హిళా నాయ‌కుల వేట‌లో అన్ని పార్టీలో ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. ఇక బీఆర్ఎస్ నుంచి చ‌ర్ల‌ప‌ల్లి కార్పొరేట‌ర్ బొంతు శ్రీ‌దేవి ఉప్ప‌ల్ నియోజ‌వ‌ర్గంలో మంచి ప‌ట్టు ఉంది. ప్ర‌జ‌ల్లో క‌లిసిపోవ‌డంతోపాటు భ‌ర్త జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి ఉప్ప‌ల్ ప్రాంతంలో పార్టీ నాయ‌కులు వేడుక‌లు, పార్టీ స‌మావేశాల‌కు హ‌జ‌రై ద‌గ్గ‌ర‌య్యారు. చ‌ర్ల‌ప‌ల్లి కార్పొరేట‌ర్‌గా ఉంటూనే నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో పేద‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తూ వ‌స్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా బొంతు శ్రీ‌దేవినే ఉన్న‌ట్లుగా ఇప్ప‌టికే ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించారు.

కాంగ్రెస్ నుంచి ఆ ఇద్ద‌రి మ‌ధ్య పోటీ

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఉప్ప‌ల్ నుంచి మాత్ర‌మే రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ ద‌క్కించుకుంది. ఉప్ప‌ల్ కార్పొరేట‌ర్ మందుముల ర‌జితా ప‌ర‌మేశ్వ‌ర‌రెడ్డి, ఏఎస్‌రావున‌గ‌ర్ కార్పొరేట‌ర్ సింగిరెడ్డి శీరిషారెడ్డి గెలిచారు. ఇప్పుడు వీరిద్ద‌రూ ఉప్ప‌ల్ ఎమ్మెల్యే మ‌హిళా అభ్య‌ర్ధులుగా పోటీలో ఉన్నారు. జ‌నంలో క‌లిసిపోవ‌డం, ప్ర‌జా స‌మ‌స్య‌లు పోరాటంలో ఇద్ద‌రూ ముందువ‌రుస‌లో ఉన్నార‌ని ఇప్ప‌టికే పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.


భాజ‌పా నుంచి ఆ ఒక్క‌రే
భార‌తీయ జ‌న‌తాపార్టీ నుంచి మ‌హిళ‌ల‌కు అవ‌కాశం వ‌స్తే పోటీలో ఐదుగురి నుంచి ఆరుగురి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ హ‌బ్సిగూడ నుంచి కార్పొరేట‌ర్‌గా గెలిచిన చేత‌న బ‌రిలో నిలిపితే గెలుపు సుల‌వుగా మారుతుంద‌ని స్థానికులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. విద్యావంతురాలు కావ‌డంతోపాటు డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు త‌క్కువ స‌మ‌యంలో చేరువ కావ‌డంతో పార్టీలో మంచి గుర్తింపు వ‌చ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నారు.

Share post:

లేటెస్ట్