ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక ఉత్సవంగా పేరు గాంచిన మహాకుంభ మేళా(Maha Kumbha Mela)లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. యూపీ ప్రయాగ్‌రాజ్(Prayagraj)లోని మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. సెక్టార్-18లోని శంకరాచార్య మార్గ్(Shankaracharya Marg)లో టెంట్లు తగలబడి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది(Fire Fighters) మంటలను ఆర్పుతున్నారు.
WATCH | Prayagraj | A fire breaks out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra. Fire tenders are at the spot. More detail awaited#MahaKumbh #FireAccident pic.twitter.com/XNTPuh9Xpa
— TIMES NOW (@TimesNow) February 7, 2025
కాగా జనవరి 30న కూడా సెక్టర్ 22లోని ఛత్నాగ్ ఝాన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో అగ్నిప్రమాదం జరిగి 18 గుడారాలు అగ్నికి ఆహూతైన సంగతి తెలిసిందే. అంతకుముందు మౌని అమావాస్య(Mauni Amavasya) సందర్భంగా తొక్కిసలాట(Stampede) జరిగి 30 మంది మరణించగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. కాగా తాజా అగ్ని ప్రమాదంపై యూపీ సీఎం అధికారులతో సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ మహాకుంభమేళాలో ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించారు.






