
జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్(Kishtwar) జిల్లాలోని చోసిటి గ్రామంలో సంభవించిన క్లౌడ్‌బరస్ట్(Cloudburst) భారీ వరదలకు కారణమై, పెను విధ్వంసాన్ని సృష్టించింది. గురువారం (ఆగస్టు 14) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు 46 మంది మరణించారు. వీరిలో ఇద్దరు CISF సిబ్బంది కూడా ఉన్నారు. సుమారు 120 మంది గాయపడగా, 38 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 200 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్లౌడ్‌బరస్ట్ సమీపం గ్రామాల్లోని లంగర్, దుకాణాలు, భద్రతా చౌకీలు, అనేక భవనాలు కొట్టుకుపోయాయి. రోడ్లు ధ్వంసమై, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
బాధితులకు తక్షణ సహాయం
NDRF, SDRF, భారత సైన్యం, పోలీసులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండు NDRF బృందాలు, 300 మంది సైనికులు, వైద్య సిబ్బంది రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ల సాయంతో గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించాయి. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరోవైపు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం(Jammu and Kashmir Government) మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. సహాయక చర్యలను వేగవంతం చేయడానికి అన్ని వనరులను ఉపయోగిస్తోంది. స్థానికులు, యాత్రికులు ఈ విపత్తును చూసి భయాందోళనకు గురయ్యారు.
ఆకస్మిక విపత్తును ఎవరూ ఊహించలేకపోయారు..
ఈ ఘటన కిష్త్వార్‌లోని రవాణా(Transport), ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు. కాగా ప్రస్తుతం వారికి పునరావాస చర్యలు తీవ్ర సవాలుగా మారాయి. క్లౌడ్‌బరస్ట్‌లు ఈ ప్రాంతంలో అరుదైనవి కాకపోయినా, ఈ ఘటన గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని సిబ్బంది అంటున్నారు. వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఈ ఆకస్మిక విపత్తును ఎవరూ ఊహించలేకపోయారు. కాగా సహాయక బృందాలు రాత్రిపూట పనిచేస్తూ, గల్లంతైన వారిని కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ విపత్తు కిష్త్వార్‌లోని స్థానిక సమాజంపై లోతైన మచ్చను మిగిల్చింది, పునర్నిర్మాణం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని నిపుణులు అంటున్నారు.
Deadly Cloudburst Triggers Flash Floods in Kishtwar, J&K; 33 Feared Dead
A cloudburst in Chositi, Kishtwar, Jammu and Kashmir today caused flash floods, killing at least 33 and leaving many missing.
The disaster struck during the Machail Mata Yatra, sweeping away a langar… pic.twitter.com/CYwdw2rj6i
— Soumyajit Pattnaik (@soumyajitt) August 14, 2025