దుబాయ్(Dubai)లోని బుర్జ్ ఖలీఫాburj khalifa) సమీపంలో సెప్టెంబర్(September)లో ఓ విప్లవాత్మక రెస్టారెంట్ ప్రారంభం కానుంది. పేరు వూహూ (WOOHOO). దీనిలో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ప్రపంచంలోనే మొదటి AI చెఫ్( AI Chef) ఉన్న రెస్టారెంట్ కావడం. ఈ ఏఐ చెఫ్ పేరు ఐమాన్ (AImaan).
ఇది వింటే, “అంతేకదా.. ఇకపై ఆహారం కూడా రోబో తయారు చేస్తుందా?” అనిపించొచ్చు. కానీ, నిజానికి ఇప్పటికీ వంట మనుషులే చేస్తారు. కానీ, మెనూ డిజైన్, పదార్థాల ఎంపిక, సర్వింగ్ స్టైల్, వంటకాలలో సృజనాత్మకత వంటి అంశాల్లో ఏఐ చెఫ్ ఐమాన్ కీలక పాత్ర పోషించనుంది.
వూహూ సహ వ్యవస్థాపకుడు అహ్మద్ ఓతున్ చకిర్ తెలిపిన వివరాల ప్రకారం, ఐమాన్‌ను ఏఐ, మానవ నైపుణ్యాల కలయికగా అభివృద్ధి చేశారు. దశాబ్దాలుగా సేకరించిన వంటల సమాచారంతో పాటు, వెయ్యికి పైగా వంటకాలపై శిక్షణ పొందిందట. పదార్థాల పరిమాణం, వాటి రూపం, తీరును చెఫ్‌లకు సూచించడంలో ఐమాన్ ఉపయోగపడుతుంది.
ఐమాన్ పాత్ర వంటచేయడమే కాదు. వంటల నాణ్యతను పర్యవేక్షించడం, కొత్త వంటల ఆవిష్కరణకు మార్గం చూపించడం, సేవలను కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మార్చడం వంటి పలు అంశాల్లో కీలకంగా వ్యవహరించనుంది. వూహూ రెస్టారెంట్(Restaurant) ద్వారా, భవిష్యత్ హోటల్ రంగానికి ఇదొక తొలి అడుగు అనే చెప్పాలి. AI–Human కలయికతో రుచికరమైన కొత్త ప్రయాణం మొదలవుతోంది!






