‘హిట్ (HIT)’ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో వస్తున్న థర్డ్ కేసులో నేచురల్ స్టార్ నాని (Nano) నటిస్తున్న విషయం తెలిసిందే. ‘హిట్: ది థర్డ్ కేస్ (HIT : The 3rd Case)’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను సోమవారం రోజున మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో నాని పుట్టిన రోజు సందర్భంగా హిట్-3 టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ నాని ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
గత్తరలేపిన నాని
ఈ టీజర్ లో నాని (Nani HIT 3 Teaser)ని ఎప్పుడూ చూడని వైలెంట్ అవతార్ లో చూశాం. తన యాక్షన్, ఇంటెన్స్ వయోలెంట్ లుక్ తో నాని గత్తరలేపాడు. శ్రీనగర్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. వరుస హత్యలు.. అర్జున్ సర్కార్ వాటిని ఎలా చేధించాడు అనే కోణంలో ఈ సినిమా సాగనుంది. కేజీయఫ్ ఫేం శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 1న ఇది విడుదల కానుంది.
హిట్-4లో రవితేజ
హిట్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. హిట్ ది ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించాడు. ఇందులో రుహానీ శర్మ హీరోయిన్ గా నటించింది. ఇక హిట్ ది సెకండ్ కేసులో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటించగా అతడికి జంటగా మీనాక్షి చౌదరి తన నటనతో మెప్పించింది. సెకండ్ పార్టు క్లైమాక్స్ లో నేచురల్ స్టార్ నాని ఎంట్రీ ఇచ్చి హిట్ ది థర్డ్ కేసులో తానే హీరో అనే హింట్ ఇచ్చాడు. ఇక హిట్-4లో మాస్ మహారాజ రవితేజ (Ravi teja) హీరోగా నటించనున్నట్లు సమాచారం.






