‘ఇష్క్’ కాంబోలో స్పోర్ట్స్ డ్రామా.. నితిన్ తగ్గేదేలే!!

జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithin) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన రాబిన్ హుడ్ (Robinhood) సినిమా మార్చి 28వ తేదీన విడుదలకు రెడీ అయింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నితిన్ వరుసగా మూడు చిత్రాలు లైన్లో పెట్టాడు.

సమ్మర్ లో తమ్ముడు

రాబిన్ హుడ్ చిత్రం పూర్తి కాగానే నితిన్ తమ్ముడు (Thammudu) మూవీలో నటించనున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు ఎంత ఇష్టమో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన ఫేవరెట్ హీరో క్లాసిక్ హిట్ మూవీ టైటిల్ తమ్ముడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ తర్వాత నితిన్ బలగం (Balagam) ఫేం వేణు యెల్దండితో కలిసి ఎల్లమ్మ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ కోసం హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు మేకర్స్.

ఇష్క్ కాంబో రిపీట్

ఇక ఎల్లమ్మ (Yellamma) సినిమా సెట్స్ కు కూడా వెళ్లకముందే నితిన్ మరో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . ఇష్క్ సినిమాతో తన కెరీర్ లో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) తో నితిన్ ఓ సినిమా చేయనున్నాడట. సై తరహా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ బ్యానర్ రూపొందించనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *