ప్రభాస్ క్రేజీ లైనప్.. ‘హోంబలే ఫిల్మ్స్’తో మరో మూడు సినిమాలు!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్, కల్కి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన డార్లింగ్ మరిన్ని హిట్స్ అందించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ (The Raja Saab) తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత హనురాఘవపూడితో ఫౌజీ (Fauji) (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఫౌజీ అనంతరం సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కు రెడీ అయ్యాడు. ఈ సినిమాలే కాకుండా ప్రశాంత్ నీల్ తో సలార్-2, నాగ్ అశ్విన్ తో కల్కి పార్ట్-2 చిత్రాలు లైనప్ లో ఉండనే ఉన్నాయి.

మరో మూడు సినిమాలు

ఈ ఐదు సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మూడు చిత్రాలు కూడా ప్రముఖ కన్నడ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) రూపొందించనున్నట్లు తెలిసింది. కేజీయఫ్, కాంతార, సలార్ (Salaar) వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాణంలో డార్లింగ్ మూడు సినిమాలకు ఓకే చెప్పినట్లు టాక్. అయితే ఈ మూడు సినిమాలకు డైరెక్టర్లను కూడా లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హోంబలేతోనే 3 చిత్రాలు

అందులో ఒకటి హను-మాన్ ఫేం ప్రశాంత్ వర్మ (Prasant Varma) దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జై హనుమాన్ మూవీ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుందట. బ్రహ్మరాక్షస్‌ అనే టైటిల్ తో రానున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించనున్నట్టు సమాచారం. ఇక సలార్-2తో పాటు ప్రశాంత్ నీల్ (Prashant Neel) -ప్రభాస్ కాంబోలో మరో సినిమా రానున్నట్లు టాక్. ఇక కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో కూడా డార్లింగ్ ఓ మూవీ చేయనున్నాడట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ మూడు సినిమాలు 2026, 2027, 2028లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతాయట.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *