‘పుష్ప’ అంటే ఇంటర్నేషనల్.. NBA ఛాంపియన్‌షిప్‌లో ‘పీలింగ్స్’ పాటకు డ్యాన్స్

‘ఏంది.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్’ అంటూ ‘పుష్ప 2 : ది రూల్ (Pushpa 2 : The Rule)’ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అదేనండి మన పుష్పరాజ్ ఓ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు గుర్తుందా. ఇప్పుడు అచ్చం అలాగే.. పుష్ప-2 మేనియా నేషనల్ వైడ్ కాదు ఇంటర్నేషనల్ రేంజుకు వెళ్లింది. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ సినిమాకు సూపర్ హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రతిష్ఠాత్మక నేష‌న‌ల్ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో NBA చీర్ లీడర్స్ ఈ సినిమాలోని పీలింగ్స్ పాటకు స్టెప్పులేశారు.

NBAకు వరల్డ్ వైడ్ క్రేజ్

నార్త్ అమెరికాలోని ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ లీగ్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (National Basketball Association) ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ ఉంది. ఇందులో ఆడే ప్లేయర్స్ కు ఫ్యాన్స్ కాదు భక్తులుంటారని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ లీగ్ లో 30 టీమ్స్ ఉంటాయి. ప్రపంచంలోని ప్రధాన ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ లీగ్‌ల‌లో నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చాలా ముఖ్యమైనది.

వచ్చుండాయి పీలింగ్స్

ప్ర‌స్తుతం ఈ టోర్నికి సంబంధించి జరుగుతున్న ఓ మ్యాచ్ ముందు చీర్ గర్ల్స్ డ్యాన్స్ చేశారు. అయితే ఏకంగా అల్లు అర్జున్-సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన పుష్ప-2లోని వచ్చుండాయి పీలింగ్స్ (Peelings) పాటకు ఈ చీర్ గర్ల్స్ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం బాగా వైర‌ల్‌ అవుతోంది.  ఈ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘మా హీరో నేష‌న‌ల్ అనుకుంటిరా ఇంట‌ర్‌నేష‌న‌ల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పుష్ప-2 సినిమా దాదాపు రూ.2వేల కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *