
బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అడ్వాణీ (Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులం కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. బేబీ సాక్స్ ను చేతుల్లో పట్టుకున్న ఫొటోను షేర్ చేసి ఈ విషయాన్ని తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు.‘‘మా లైఫ్ లో ఓ అద్భుతమైన బహుమతి త్వరలో రానుంది’’ అంటూ ఈ తీపి కబురును చెప్పారు. ఈ ఫొటో కింద బేబీ ఎమోజీని యాడ్ చేశారు.
సిధ్ -కియారాకు విషెస్
ఇక ఈ పోస్టు చూసి నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వెల్ కమ్ టు పేరెంట్స్ క్లబ్ అంటూ పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు విషెస్ తెలియజేశారు. ఇక వీరి అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ జంట చెప్పిన గుడ్ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది.
View this post on Instagram
అలా ఒక్కటయ్యారు
ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ 2021లో విడుదలైన ‘షేర్షా’ (Shershaah) సినిమా కోసం తొలిసారి కలిసి పని చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడింది. అలా దాదాపు రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ కపుల్ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అలా కుటుంబ సభ్యుల సమక్షంలో 2023 ఫిబ్రవరి 7వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
బిజీబిజీగా స్టార్ కపుల్
ఇక పెళ్లి తర్వాత కూడా ఈ జంట తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యారు. ఇద్దరూ తమ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవలే కియారా రామ్ చరణ్ తో కలిసి నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధార్థ్ పరమ్ సుందరి, వివ్యాన్ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.