ధైర్యమే కవచం.. ఆశే ఆయుధం.. కొత్త సినిమా ప్రకటించిన సాయి దుర్గాతేజ్

Mana Enadu : సాయి దుర్గా తేజ్(Sai Durga Tej).. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత ఈ సుప్రీం హీరో తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ ప్రాజెక్టు చేస్తున్న ఈ హీరో ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తన మరో ప్రాజెక్టును ప్రకటించాడు. మరో ఆసక్తికరమైన కథతో తాను త్వరలో ముందుకు రాబోతున్నట్లు తెలిపాడు.

#SDT18 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా మేకింగ్‌ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘హనుమాన్(Hanu Man)’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ సినిమాతో రోహిత్‌ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్‌కు పుట్టినరోజు(SDT Birth Day) శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ సినిమాలో సాయి దుర్గా తేజ్ కు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ నటించనున్నట్లు సమాచారం.

ఇక గాంజా శంకర్(Ganja Shankar) సినిమా విషయానికి వస్తే.. సితారా ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సాయిధరమ్​ తేజ్.. శంకర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథానాయిక గురించి ఎలాంటి అనౌన్స్​మెంట్ చేయలేదు మూవీ యూనిట్.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *