Telangana : గ్రూప్​-1 మెయిన్స్​కు లైన్​ క్లియర్

Mana Enadu : తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షల(TGSPSC Group-1 Mains) నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.  ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ప్రిలిమ్స్‌లోని 7 ప్రశ్నలకు తుది ‘కీ’లో సరైన జవాబులు ఇవ్వలేదని, ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పిటిషనర్లు వ్యాజ్యం దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు(Telangana High Court) పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈనెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్

మరోవైపు ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్ల(Group-1 Mains Hall Tickets 2024)ను టీడీపీఎస్సీ విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించనున్నారు. 1.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రం గేట్లు మూసి వేస్తారు.

మూడు భాషల్లో మెయిన్స్ పరీక్షలు

మెయిన్స్ పరీక్షలను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన పేపర్లన్నీ అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో రాయాలి. గ్రూప్-1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండనున్నాయి. ఈ ఏడాది జూన్‌ 9వ తేదీన నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌(Group-1 Mains)కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. సుమారు 3లక్షల మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.

అభ్యర్థులకు ముఖ్య సూచనలు :

  • అభ్యర్థులు హాల్​ టికెట్లు.. అన్ని పరీక్షల క్వశ్చన్​ పేపర్లు సెక్షన్​ పూర్తయ్యేంత వరకు భద్రంగా ఉంచుకోవాలి.
  • పరీక్షా హాల్​లోకి గడియారాలు, క్యాలికేటర్లు, స్లిప్​లు, ఎలాంటి కాగితాలు తీసుకెళ్లకూడదు.
  • హాల్​ టికెట్లు డౌన్​లోడ్​ చేసుకొనే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే టీజీపీఎస్సీ టెక్నికల్​ హెల్ప్​ డెస్క్​ నంబర్లు 040-23542185, 040-23542187కు కాల్​ చేయవచ్చు.
  • ఫోన్​ ద్వారా కాకుంటే Helpdesk@tspsc.gov.in కు మెయిల్ చేయవచ్చు.

Share post:

లేటెస్ట్