‘డెకాయిట్’ నుంచి శ్రుతిహాసన్ ఔట్!

Mana Enadu : స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్(Shruti Haasan) ఇటీవలే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ భామ చేతిలో సలార్ పార్ట్-2తో పాటు రజినీ కాంత్ కూలీ(Coolie), అడివి శేష్ తో కలిసి నటిస్తున్న డెకాయిట్ చిత్రాలు ఉన్నాయి. ఓవైపు సింగర్ గా.. మ్యుజీషియన్ గా.. మరోవైపు నటిగా రాణిస్తోంది శ్రుతి. అయితే తాజాగా ఈ భామ డెకాయిట్ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

డెకాయిట్ నుంచి శ్రుతి ఔట్

అడివి శేష్ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షనైల్ డియో(Shaneil Deo) తొలిసారి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్న మూవీ ‘డెకాయిట్’. ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్​కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ టీజర్ లో అల్లర్లు జరిగిన ప్రాంతంలో తుపాకీ పట్టుకుని, శ్రుతి గ్లింప్స్​లో కనిపించింది.

డెకాయిట్ టీజర్

అడివి శేష్(Adivi Sesh), శ్రుతి ప్రేమించుకుని విడిపోయి మళ్లీ కలిసి దోపిడీలు చేయడం చుట్టూ సినిమా తిరుగుతున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ చెప్పారు. ఇంటెన్స్, లవ్ యాక్షన్ చిత్రంగా ‘డెకాయిట్’ తెరకెక్కుతున్నట్లు ట్యాగ్ లైన్ (ఒక ప్రేమ కథ) చూస్తే తెలుస్తోంది.

ఆయన వల్లే శ్రుతి ఔట్

అయితే ఇప్పుడు శ్రుతి హాసన్ ‘డెకాయిట్(Dacoit)’ నుంచి తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యిందని టాక్. అయితే శ్రుతి పాత్రకు సంబంధించి షూటింగ్ కు.. డేట్స్ ఇష్యూ వల్ల ఈ భామ ‘డెకాయిట్’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు డైరెక్టర్ షనైల్ డియో తన ఫ్యామిలీతో కలిసి పని మీద విదేశాలకు వెళ్లిన సమయంలో మూవీలోని కొన్ని షాట్లు అడివి శేష్ షూట్ చేశారట. ఇది నచ్చని శ్రుతి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

తెలుగు, హిందీలో వేర్వేరుగా షూటింగ్

ఇక ‘డెకాయిట్’ సినిమా విషయానికొస్తే, ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నటి సుప్రియ యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి(Goodachari)’ లాంటి బ్లాక్​బస్టర్‌ సినిమాలకు ఫొటోగ్రఫీ డైరెక్టర్​గా పనిచేసిన షనైల్ డియో ఈ సినిమాతో డైరెక్టర్​గా పరిచయం అవుతున్నారు.  ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో వేర్వేరుగా షూటింగ్ జరపనున్నారు.

 

Share post:

లేటెస్ట్