నేడే మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు నగారా!

Mana Enadu : దేశంలో మరోసారి ఎన్నికల సందడి షురూ కానుంది. ఇటీవలే హర్యానా, జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇక త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections)కు నగారా మోగనుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ (అక్టోబర్ 15వ తేదీ) ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ (Election Commission) మీడియా సమావేశం నిర్వహించనుంది.

3 ఎంపీ స్థానాలకు.. 47 స్థానాల్లో ఉపఎన్నికలు

మహారాష్ట్ర, జార్ఖండ్ (Jharkhand Election Schedule) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు మూడు లోక్‌సభ స్థానాలు, కనీసం 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీలను కూడా ఈసీ ప్రకటించే అవకాశముంది. కేరళలోని వయనాడ్ (Wayanad By polls), మహారాష్ట్రలోని నాందేడ్‌, పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హట్‌ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలీలోనూ విజయం సాధించారు.

ఇవాళే ఎన్నికల షెడ్యూల్

అనంతరం ఆయన వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక 288 మంది శాసనసభ్యులు ఉన్న మహారాష్ట్ర (Maharashtra) ప్రస్తుత అసెంబ్లీకి ఈ ఏడాది నవంబరు 26తో..  81 స్థానాలున్న ఝార్ఖండ్‌ (Jharkhand) శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ రాష్ట్రాల్లో ఎన్నికలకు నగారా మోగనుంది.

అందుకే వాయిదా

ఇటీవల జమ్మూకశ్మీర్‌, హర్యానా(Haryana Polls)లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ కూటమి ఘనవిజయం సాధించింది. హర్యానాలో అధికార బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది.  ఈ ఎన్నికలతోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వర్షాలు, వినాయక చవితి, నవరాత్రి, దీపావళి వంటి పండగలు ఉండటంతో కొద్ది రోజులు వాయిదా వేశారు.

Share post:

లేటెస్ట్