Mana Enadu : సాయి దుర్గా తేజ్(Sai Durga Tej).. విరూపాక్ష, బ్రో సినిమాల తర్వాత ఈ సుప్రీం హీరో తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ ప్రాజెక్టు చేస్తున్న ఈ హీరో ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తన మరో ప్రాజెక్టును ప్రకటించాడు. మరో ఆసక్తికరమైన కథతో తాను త్వరలో ముందుకు రాబోతున్నట్లు తెలిపాడు.
#SDT18 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ‘హనుమాన్(Hanu Man)’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ సినిమాతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
‘ధైర్యాన్నే తన కవచంగా, ఆశనే ఆయుధంగా చేసుకున్న ఈ వ్యక్తి అందరికోసం నిలబడతాడు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే’ అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్‌కు పుట్టినరోజు(SDT Birth Day) శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఈ సినిమాలో సాయి దుర్గా తేజ్ కు జోడీగా ఐశ్వర్య లక్ష్మీ నటించనున్నట్లు సమాచారం.
ఇక గాంజా శంకర్(Ganja Shankar) సినిమా విషయానికి వస్తే.. సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్.. శంకర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కథానాయిక గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు మూవీ యూనిట్.