
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ (Vishwaksen) హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ (Laila). ఆకాంక్ష శర్మ (Akanksha Sharma) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఈ నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అయితే ఈ వేడుకలో.. తన పాత్రకు సంబంధించిన విశేషాలు చెబుతూ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పృథ్వీ వివాదాస్పద కామెంట్స్
150 మేకల్లో చివరకు 11 మిగిలాయని ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైంది. #BoycottLaila అనే ట్రెండ్ కాస్త విపరీతంగా వైరల్ కావడంతో చిత్రబృందం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి (Sahu Garapati) పృథ్వీ కామెంట్స్ పై వివరణ ఇచ్చారు.
View this post on Instagram
మా మూవీని చంపేయకండి
“పృథ్వీ (Prudhvi Raj) వ్యాఖ్యలకు నేను క్షమాపణ చెబుతున్నాను. ఒక్కరు తప్పు చేస్తే మిగిలిన వాళ్లు ఇబ్బంది పడాలా.. పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. మేము చిరంజీవి (Chiranjeevi)ని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్లినప్పుడు అతను మాట్లాడారు. అది మా కంట్రోల్ లో జరగలేదు. మాది సినిమా ఈవెంట్.. రాజకీయాలు మాట్లాడకూడదు. దయచేసి మా సినిమాను చంపేయకండి. నాకు రాజకీయాలు మాట్లాడేంత అనుభవం లేదు.” అంటూ విశ్వక్ సేన్ రిక్వెస్ట్ చేశాడు.
సినిమాను సినిమాగా చూడండి
ఇక ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ‘లైలా’ బాయ్‌కాట్ ట్రెండ్ చూసి షాకయ్యామని అన్నారు. ఆ వ్యక్తి ( పృథ్వీని ఉద్దేశించి) మాట్లాడే సమయంలో తాను, తన హీరో విశ్వక్ అక్కడ లేమని చెప్పారు. ఏది ఏమైనా సినిమా ఒకరిద్దరిది కాదని.. వేల మంది కష్టపడి పని చేస్తేనే అవుట్‌పుట్ వస్తుందని తెలిపారు. ఇది వేరే కోణంలో ప్రచారం అవడం వల్ల సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇబ్బందేనని పేర్కొన్నారు. సినిమాని సినిమాలాగా చూడాలనేది తమ విజ్ఞప్తి అని సాహు కోరారు.