Abhinaya : వైభవంగా SVSC నటి వివాహం.. ఫొటోలు చూశారా?

నటి అభినయ (Abhinaya) టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నేనింతే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఆమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా హీరోలకు సోదరి పాత్రలో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (Seethamma Vakitlo Sirimalle Chettu ) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుట్టుకతో మూగ, చెవిటి అయిన అభినయ నటనకు అవేం అడ్డుకావని నిరూపించింది.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

కార్తీక్ వెడ్స్ అభినయ

ఇక తాజాగా నటి అభినయ హైదరాబాద్‌కు చెందిన వి.కార్తిక్‌ (Sunny Varma)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. నగరంలోని జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో బంధుమిత్రుల సమక్షంలో ఆమె ఏడడుగులు (Actress Abhinaya Wedding) వేసింది.  ఈ నెల 20వ తేదీన రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. మార్చి 9వ తేదీన వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by M.g Abhinaya (@abhinaya_official)

కొత్త జంటకు శుభాకాంక్షలు

అయితే అభినయ, కోలీవుడ్ హీరో విశాల్ (Actor Vishal)తో ప్రేమలో ఉన్నట్లు గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇటీవల తన నిశ్చితార్థం జరిగిన తర్వాత అభినయ పంచుకున్న ఫొటోల్లో వరుడి ముఖం చూపించకపోవడంతో అంతా హీరో విశాలే పెళ్లి కొడుకని భావించారు. కానీ ఆ తర్వాత ఈ భామ తనకు కాబోయే వరుడు కార్తీక్ అని చెబుతూ ఫొటోలు షేర్ చేసి అందరికీ పరిచయం చేయడంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక అభినయ-సన్నీ దంపతులకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related Posts

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Ram Pothineni: రామ్ కొత్త మూవీ గ్లిమ్స్ వచ్చేసింది.. మూవీ పేరు ఇదే..

రామ్ పోతినేతి (Ram Pothineni), భాగ్య శ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబోలో మహేశ్ బాబు.పి తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించిన సూపర్ అప్డేట్ వచ్చేసింది. రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ (Andhra King…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *