
ఈ మధ్య మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్(Casting Couch) వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. మహిళలపై లైంగిక వేధింపులపై హేమ కమిటీ(Hema Committee) ఇచ్చిన రిపోర్టుతో మలయాళ ఇండస్ట్రీ(Malayalam Industry) గురించి అంతా చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి నటీమణులు ఆరోపణలు కూడా ఎక్కువైపోయాయి. తరచూ ఎవరోకరు బయటకు వచ్చి తోటి నటుల వల్ల తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. తాజాగా మరో మలయాళ నటి విన్సీ అలోషియస్(Vincy Aloshious) బయటకు వచ్చి ఓ స్టార్ హీరోపై సంచలన కామెంట్స్ చేసింది.
అదోక అసహ్యకరమైన సంఘటన
ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. డ్రగ్స్(Drugs) మత్తులో ఓ హీరో తనదో అసభ్యకరంగా ప్రవర్తించారని, అదోక అసహ్యకరమైన సంఘటన అంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. “నేను ఈ వీడియో చేయడానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఓ కార్యక్రమంలో నేను చేసిన కామెంట్స్‌పై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. వాటిని నేను క్లియర్ చేయాలనుకుంటున్న. అందుకే ఈ వీడియో(Video) చేస్తున్నా. ‘ఇటీవల నేను నటించిన ఓ సినిమా హీరో షూటింగ్‌లో డ్రగ్స్ తీసుకున్నాడు. నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నని రోజులు అతడి వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను’’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
Malayalam actor Vincy Aloshious revealed that her co-star, allegedly under the influence of drugs, insisted on fixing her dress. However, she did not name the person.#VincyAloshious #MO #Malayalam #Actor pic.twitter.com/VvoiZih7Lu
— IndiaToday (@IndiaToday) April 16, 2025
అప్పుడే అతడు డ్రగ్స్ తీసుకుంటాడని అర్థమైంది
ఒక రోజు షూటింగ్‌లో నా డ్రస్ కాస్తా అన్‌కంఫర్ట్‌గా ఉంది. ఆ విషయాన్ని అతడు నాతో చెప్పాడు. సరే మార్చుకుని వస్తానని క్యారవాన్ వైపు వెళుతున్నాను. అప్పుడతను పదా నేను కూడా నీతో వస్తాను అన్నాడు. తన ముందే దుస్తులు మార్చుకోమని ఇబ్బంది పెట్టాడు. షూటింగ్‌లో అందరి ముందే నాతో అలా అనేసరికి షాక్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని రోజులకు అదే సినిమా సెట్‌లో ఆ హీరో నోటి నుంచి తెల్లని ప్రదార్థం బయటపడింది. అప్పుడే అతడు డ్రగ్స్ తీసుకుంటాడని అర్థమైంది. ఇక భవిష్యత్తులో డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో నటించకూడదని నిర్ణయించుకున్న. నాతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికి తెలుసు. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు” అని వాపోయింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ మలయాళ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అయితే ఆ హీరో పేరును విన్సీ (Vincy) వెల్లడించలేదు.