
తమిళ్ బిగ్‌బాస్-3 ఫేమ్, సినీ నటి మీరా మిథున్(Meera Mithun)ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని తమిళనాడు(Tamilanadu)లోని న్యాయస్థానం ఆదేశించింది. దళితుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై నటి మీరా మిథున్‌పై వీసీకే తరపున గతంలో ఫిర్యాదు చేయగా, ఆమె, ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్(Shyam Abhishek)పై చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(Chennai Central Crime Branch) పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా 2021 ఆగస్టులో అరెస్టు చేయగా, నెల రోజులకు ఇద్దరూ బెయిల్(Bail)పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో మీరా మిథున్‌పై 2022లో నాన్ బెయిలబుల్ వారెంట్(Non-bailable warrant) జారీ అయింది. అరెస్టు వారెంట్ జారీ అయి మూడేళ్లు అవుతున్నా ఆమె పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు.
ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతూ..
ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర వీధుల్లో తిరుగుతున్న మీరా మిథున్‌ను రక్షించాలని కోరుతూ ఆమె తల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్(Petetion) కోర్టులో విచారణకు రాగా, పోలీసుల తరపున న్యాయవాది ఢిల్లీ పోలీసులు మీరా మిథున్‌ను రక్షించి అక్కడున్న హోంకి తరలించినట్లు తెలిపారు. ఢిల్లీ హోంలో ఉన్న మీరా మిథున్‌ను అరెస్టు చేసి ఈ నెల 11న హాజరుపరచాలని న్యాయమూర్తి చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు. కాగా మీరా రోమియో జూలియట్, 8 తొట్టక్కల్, కలలు కనే రాత్రులు వంటి చిత్రాలలో నటించింది.
#dinamani | நடிகை மீரா மிதுன் கைது!#meeramithun #meeramithunarrest #arresthttps://t.co/NyC0XkPkTf
— தினமணி (@DinamaniDaily) August 4, 2025