డ్రెస్ మార్చుకుంటుండగా కారవాన్‌లోకి డైరెక్టర్.. హీరోయిన్ ఏం చేసిందంటే?

‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది షాలినీ పాండే (Shalini Pandey). మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నా.. ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. అడపాదడపా వచ్చిన అవకాశాలతో తెలుగు, తమిళం ఇండస్ట్రీల్లో పలు చిత్రాలు చేసింది. ఇక ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ బాలీవుడ్ పైనే పెట్టింది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘డబ్బా కార్టెల్’  అనే వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ భామ పలు మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తోంది.

Image

డోర్ కొట్టకుండా డైరెక్టు వచ్చేశాడు

అయితే డబ్బా కార్టెల్ (Dabba Cartel) ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలినీ పాండే కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి షేర్ చేసుకుంది. ఓ సినిమా షూటింగు సమయంలో కారవాన్ లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో డైరెక్టర్ డోర్ కొట్టకుండా డైరెక్టుగా వచ్చేశాడని తెలిపింది. సౌత్ ఇండస్ట్రీలో పని చేస్తున్న సమయంలో కారవాన్‌లో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో పర్మిషన్‌ లేకుండానే దర్శకుడు డోర్‌ తీశాడని షాలినీ చెప్పుకొచ్చింది. దీంతో కోపం వచ్చి అతడిపై కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని పేర్కొంది.

ఇప్పుడలాంటి సమస్యల్లేవ్

“డైరెక్టర్ పై కేకలు వేయడం కరెక్టు కాదని అప్పుడు అక్కడున్న వారంతా నాతో చెప్పారు. కానీ ఆ సమయంలో నాకు అదే కరెక్టనిపించింది. తప్పుగా అనిపించలేదు. అయితే ఆ తర్వాత నాకెప్పుడూ అలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఒకవేళ అలాంటి సమస్యలు ఎదురైనా డైరెక్టుగా ముఖం మీదే కోప్పడకుండా వారికి అర్థమయ్యేలా.. నా అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఎలా సమాధానం చెప్పాలో ఇన్నేళ్ల నా సినీ జర్నీలో తెలుసుకున్నాను.” అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షాలినీ చెప్పిన ఆ సౌత్ డైరెక్టర్ ఎవరని నెట్టింట చర్చ జరుగుతోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *