
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) కాంబోలో వస్తున్న ‘స్పిరిట్ (Spirit)’ సినిమా ఒకటి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్.. కల్కి వంటి సూపర్ హిట్ తర్వాత డార్లింగ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి. మరోవైపు ప్రభాస్ తన సినీ కెరీర్ లోనే తొలిసారిగా పోలీసు పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్పిరిట్ నుంచి క్రేజీ అప్డేట్
కనీసం ఒక్క అప్డేట్ అయినా వస్తే బాగుండని డార్లింగ్ అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా (Spirit Film Update) ఉంటుందని సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే పలుమార్లు ప్రకటించినా.. అప్డేట్స్ ఏం ఇవ్వకపోవడంతో ఎప్పుడు వస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారట.
ఉగాది రోజున స్పిరిట్ ప్రారంభం
తెలుగు కొత్త సంవత్సరం ఉగాది (Ugadi Festival) పర్వదినాన పూజ కార్యక్రమం నిర్వహించి ఈ మూవీని ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు ఇంకా సమయం పడుతుందట. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ (The Raja Saab), ఫౌజీ సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలు పూర్తవ్వగానే.. స్పిరిట్ కోసం ప్రభాస్ డేట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా ఈ రెండు సినిమాలు పూర్తవుతాయని.. ఆ తర్వాత స్పిరిట్ షూటింగ్ జరిగే అవకాశం ఉండనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.