నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ఈ చిత్రంలో బాలయ్య, బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాకు మధ్య ‘దబిడి దిబిడి (Dabidi Dibidi)’ అనే ఓ స్పెషల్ సాంగ్ వస్తుంది. ఈ పాట కొరియోగ్రఫీపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. బాలయ్య స్టెప్పులు చాలా వల్గర్ గా ఉన్నాయంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా ఈ సాంగ్ కొరియోగ్రఫీపై వచ్చిన కాంట్రవర్సీ గురించి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) స్పందించింది.
ఆ ట్రోలింగ్ ఊహించలేదు
“డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ (Dabidi Dibidi Song Controversy) రిహార్సల్స్ చాలా కూల్ గా జరిగాయి. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నేను ఆయనతో నాలుగు సార్లు వర్క్ చేశాను. ఆయన దబిడి దిబిడి పాటకు స్టెప్పులు కంపోజ్ చేసినప్పుడు నాకు వల్గర్ గా ఏం అనిపించలేదు. రిహార్సల్స్ చేస్తున్నప్పుడు కూడా అభ్యంతరకరంగా అనిపించలేదు. కానీ సాంగ్ రిలీజ్ తర్వాత నెట్టింట వచ్చిన విమర్శలు, ట్రోల్స్ చూసి షాక్ అయ్యాను. రిహార్సల్స్ క్లిప్స్ రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి విమర్శలు రాలేదు. సోషల్‌మీడియా వేదికగా కొంతమంది కావాలని చేసే వ్యాఖ్యలను నేను పట్టించుకోను.” అని ఊర్వశీ చెప్పుకొచ్చారు.
Urvashi rautela is first ever Indian woman to dance on dabidi dibidi which has crossed 150 + crores, game changer flopped but her daku maharaj is a blockbuster hit it’s clearly not her fault 🥵 pic.twitter.com/xGp6m8wSbF
— 𐙚 (@thekritiverse) February 1, 2025
డాకు మహారాజ్ @ రూ.100 కోట్లు
ఇక డాకు మహారాజ్ సినిమా సంగతికి వస్తే నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ (Bobby Kolli) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, బాబీ దేవోల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సుమారు రూ.100 కోట్లకు పైగా వసూలు (Daaku Maharaaj Collections) చేసినట్లు అంచనా.






