
రాజా దారపునేని నిర్మాతగా రాజ్ గురు బ్యానర్‌పై దయానంద్ గడ్డం(Dayanand Gaddam) రచనా దర్శకత్వంలో జులై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం వర్జిన్ బాయ్స్(Virgin Boys). ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షుల ముఖ్య పాత్రలు పోషించనున్నారు. స్మరణ్ సాయి(Smaran Sai) సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. బబ్లు, కౌశల్ మంద(kaushal Manda), ఆర్జె సూర్య, సుజిత్ కుమార్, కేదార్ శంకర్, ఆర్జె శరన్, శీతల్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్(Teaser) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా నుంచి ట్రైలర్(Trailer)ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు గిఫ్ట్
అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా వర్జిన్ బాయ్స్(Virgin Boys) తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే ఈ సినిమా టికెట్ కొన్న 11 మందికి ఐఫోన్లు(Iphones) గిఫ్ట్‌గా ఇస్తామని ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చిత్ర బృందం తెలిపింది. మనీ రైన్ ఇన్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో కొన్ని థియేటర్లలో డబ్బు మీపై వర్షంలో కురిసి ఆ డబ్బు ప్రేక్షకులు సొంతం చేసుకోవచ్చు మూవీ టీమ్ తెలిపింది. ట్రైలర్‌లో అడల్ట్ కామెడీతో పాటు ఎమోషన్స్‌ను కూడా చూపించారు. ప్రేమ, పెళ్లి ఎంత గొప్పవి.. ఆకర్షణకు లోనై ముగ్గురు యువకులు చేసిన తప్పు ఏంటి.. ? అనేది ట్విస్ట్ గా చూపించారు. ఇక ట్రైలర్ లో మిత్రా శర్మతో పాటు మిగిలిన హీరోయిన్స్ అందాలు ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్‌లో చాలా బూతులే గుప్పించారు. మరి మీరూ వర్జిన్ బాయ్స్ ట్రైలర్ చూసేయండి..