
పెళ్లిళ్లు చేసుకోకముందే క్రీడల్లో నుంచి రిటైర్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు త్వరగా క్రీడలకు వీడ్కోలు పలికి ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫార్మాట్లో తండ్రీ కొడుకులు కలిసి ఆడడం ఎంతో విశేషం. అలాంటి అరుదైన ఘటన అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆవిష్కృతమైంది. అఫ్గాన్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (mohammad nabi) విషయంలో అరుదైన విషయం చోటుచేసుకుంది. తన కుమారుడికి ప్రత్యర్థిగా బరిలో దిగిన నబీకి.. వేసిన ఫస్ట్ బాల్కే సిక్సర్‌తో వెల్కమ్ చెప్పాడు.
36 బంతుల్లో 52 రన్స్
అఫ్గానిస్థాన్ ప్రీమియర్ టీ20 క్రికెట్ టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ (SCL)లో 40 ఏళ్ల మహమ్మద్ నబీ (mohammad nabi) మిస్ ఐనక్ రీజియన్ తరపున బరిలోకి దిగాడు. అతడి కుమారుడు 18 ఏళ్ల హసన్ ఐసాఖిల్ (Hassan Eisakhil).. అమో రీజియన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా మహమ్మద్ నబీ తొమ్మిదో ఓవర్ వేశాడు. తొలి బంతిని తన కుమారుడు హసన్ ఎదుర్కొన్నాడు. తండ్రి వేసిన ఫస్ట్ బాల్నే కొడుకు మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో హసన్ హాఫ్ సెంచరీ చేశాడు. మొదట బ్యాటింగ్ చేసిన అమో రీజియన్స్ జట్టు 162 రన్స్ చేసింది. 36 బంతుల్లో 52 రన్స్ చేసిన హసన్ హైయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.
IT’S FATHER VS SON!!
– Hassan Eisakhil welcomed his father Mohammad Nabi with a big six in SCL.🔥😍pic.twitter.com/cH8pohXsXs
— ACB Xtra (@acb_190) July 22, 2025