Suriya Birthday Special: ‘ఇది మన టైమ్‌’ అంటూ సూర్య కరుప్పు టీజర్ రిలీజ్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా సూర్య తన 45వ చిత్రం ‘కరుప్పు(Karuppu)’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో సూర్య సరసన స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ (Trisha Krishnan)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ కమెడియన్, దర్శకుడు RJ బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌(First Look Poster) అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా కరుప్పు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Karuppu: On his 50th birthday, Suriya reveals an action-filled poster;  teaser set to be released on... | Zoom TV

నా పేరు సూర్య.. నాకు ఇంకోపేరు కూడా ఉంది

నేడు సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌(Teaser)ను విడుదల చేశారు. ‘నా పేరు సూర్య.. నాకు ఇంకోపేరు కూడా ఉంది’, ‘ఇది మన టైమ్‌’ అంటూ సూర్య తన వింటేజ్‌లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. టీజర్‌ ఆధారంగా చూస్తే ఇందులో మాస్‌ సన్నివేశాలు(Mass Scenes) ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతోంది. సూర్య వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి, యాక్షన్, ఎమోషన్, డ్రామాతో కూడిన సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. ఆర్జే బాలాజీ, తన కామెడీ టైమింగ్‌కు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఈ చిత్రంలో సీరియస్ కథనాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్‌లోని విజువల్స్, నేపథ్య సంగీతం, సూర్య మాస్ నటన సూపర్‌గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ టీజర్‌ని చూసేయండి..

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *