కోలీవుడ్‌లో రూపొంది తెలుగులోకి డబ్ అయిన మూవీలతోనే అలరిస్తున్నారు ప్రముఖ కమెడియన్ యోగిబాబు (Yogi Babu). ఎన్నో ఏళ్లుగా ఫేమస్ కమెడియన్‌గా కొనసాగుతున్న ఆయన తెలుగులో మాత్రం ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు మూవీలో నటించలేదు. కానీ ఎట్టకేలకు ఆయన తొలిసారి ఓ తెలుగు చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటిస్తోన్న ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Papi Reddy) మూవీలో యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. యోగిబాబు పుట్టినరోజు ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు.
‘ఉడ్రాజు’ అనే క్యారెక్టర్లో..
డార్క్ కామెడీ జానర్లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న గుర్రం పాపిరెడ్డి మూవీకి మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తున్నాడు. వేణు సట్టి, అమర్ బురా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యోగిబాబు ‘ఉడ్రాజు’ అనే క్యారెక్టర్లో నటిస్తున్నాడని, ఆయన నటన ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు. బ్రహ్మానందం, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Many Many Happy Returns of the Day to Yogi Babu.🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰🍰
May God Bless You Long, Healthy and Successful Life.@iYogiBabu #HBDYogiBabu#YogiBabu pic.twitter.com/m6n0wQOc1R
— Sachin Dubey (@SachinDubey4444) July 22, 2025






