
ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్(Box Office) దగ్గర చరిత్ర తిరగరాస్తుంటాయి. తాజాగా అదే కోవలోకి వచ్చింది యశ్ రాజ్ ఫిల్మ్స్(Yash Raj Films) సంస్థ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘సైయారా(Saiyaara 2025)’ మూవీ. డైరెక్టర్ మోహిత్ సూరి(Mohith Suri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో అహన్ పాండే(Ahaan Panday), అనీత్ పడ్డా(Aneet Padda) హీరో, హీరోయిన్లుగా పరిచయమయ్యారు. పెద్దగా ఎవరికీ ఎలాంటి అంచనాలు లేని ఈ సినిమా జులై నెల 18న విడుదలైంది. రిలీజైన తొలి రోజే దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల నెట్ వసూళ్లతో మొదలై.. ఆ తర్వాత ఆగకుండా అదే రన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అంతేకాదు కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన హీరో, హీరోయిన్ల చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు దక్కడం చూసి బాలీవుడ్ ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
రూ. 404 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సంచలనం
రేపటితో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు వారాలు పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 260.25 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఒక ఓవర్సీస్ లో $10 మిలియన్ US డాలర్స్‌ను కలెక్ట్ చేసింది. మన కరెన్సీలో దాదాపు రూ. 86 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారత్‌లోని రూ.318 కోట్ల గ్రాస్ వసూళ్లను కలిపితే.. మొత్తంగా రూ. 404 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సంచలనం రేపుతోంది.
‘ఛావా’ తర్వాత అత్యధిక వసూళ్లు
మొత్తంగా సోమవారం(జులై 28) వరకు రూ. 260.25 కోట్ల వరకు రాబట్టింది. ఇక మంగళవారం(జులై 29) ఈ సినిమా దాదాపు రూ. 7 కోట్ల వరకు నెట్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా నిన్నటితో ఈ సినిమా రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి.. త్వరలో రూ. 600 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. మొత్తంగా ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ యేడాది ‘ఛావా’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ముందు ముందు ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
Saiyaara Box Office Collection Day 11: Ahaan Panday-Aneet Padda’s movie crosses 250 crore in India #Saiyaara #SaiyaraaBusiness #AhanPandey #AneetPadda #MohitSuri pic.twitter.com/KVbHrifylv
— Maneesh (@maneeshsaxena) July 29, 2025