తెలుగు సినీ నటి పాయల్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమెకు తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (67) ఇకలేరు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న ఆయన, జూలై 28 (సోమవారం)న తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో పాయల్ రాజ్‌పుత్ కన్నీరు మున్నీరయ్యారు.
తండ్రి మరణవార్తను పాయల్ తన సోషల్ మీడియా ద్వారా ఆవేదనతో తెలియజేశారు. “నాన్నా…” అంటూ గుండె విరిగిన ఎమోజీతో తన బాధను పంచుకున్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గత కొన్ని నెలలుగా విషమంగా ఉందని అప్పటికే పాయల్ వెల్లడించారు. కీమో థెరపీ జరుగుతుందని, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులందరి ఆశీస్సులు కావాలంటూ ఒక పోస్ట్ కూడా చేశారు.
View this post on Instagram






