గుజరాత్లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విషాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్‌కు బయల్దేరినట్లు ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం. ఇందులో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా వాసి ఉన్నట్లు ఎయిరిండియా తెలిపింది. రన్వే పైనుంచి పైకెరిగిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
ప్రధాని దిగ్భ్రాంతి..
ప్రమాదంపై ప్రధాని మోదీతోపాటు గుజరాత్, బెంగాల్, అస్సాం సీఎంలు భూపేంద్ర పటేల్, మమతా బెనర్జీ, హిమంత బిశ్వశర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు అప్‌డేట్ చేయాలని కేంద్రమంత్రికి ఆదేశాలు జారీ చేశారు.






