అక్కినేని ‘అఖిల్’ కొత్త సినిమా టైటిల్ ఇదే!

అక్కినేని వారసుడు అఖిల్ (Akkineni Akhil) నుంచి దాదాపుగా రెండేళ్ల నుంచి ఒక్క సినిమా రాలేదు. ఏజెంట్ (Agent) సినిమా ఫలితంలో తీవ్ర నిరాశ చెందిన అఖిల్ రెండేళ్ల తర్వాత ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ఈ యంగ్ హీరో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు.

అఖిల్ న్యూ మూవీ అప్డేట్

అయితే తాజాగా అఖిల్ కొత్త చిత్రం (Akhil Upcoming Film) గురించి ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. హైదరాబాద్ లో ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందట. మరోవైపు ఈ మూవీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. అధికభాగం షూటింగును చిత్తూరు జిల్లాలోనే చేయనున్నట్లు సినీవర్గాల్లో టాక్.

అఖిల్ కొత్త సినిమా టైటిల్

ఇక అఖిల్ కు జోడీగా ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela)ను తీసుకోనున్నట్లు సమాచారం. మరి ఆ భామ అఖిల్ తో సినిమా చేసేందుకు సై అంటుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అఖిల్- మురళీ కిషోర్ అబ్బూరి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ‘లెనిన్ (LENIN)’ అనే టైటిల్ ఖరారు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Related Posts

Masooda Ott: మరో ఓటీటీలోకి మసూద.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అభిమానుల్లో సస్పెన్స్‌తో కూడిన హారర్(Horror) చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుంటుంది. ఇలాంటి సినిమాల(Movies)ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇలాంటి ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులకు మాంచి థ్రిల్‌(thrill)ని అందించాయి. సరిగ్గా ఇలాంటి థ్రిల్‌నే 2022లో విడుదలైన ‘మసూద(Masooda)’ సినిమా…

Prabhas : ‘ది రాజాసాబ్’ హై అలర్ట్.. మేలో అదిరిపోయే సర్ ప్రైజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’ మూవీ తర్వాత ఓకే చేసిన ఫస్ట్ సినిమా ‘ది రాజాసాబ్ (The Raja Saab)’. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై దాదాపుగా పూర్తైంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. కానీ అకస్మాత్తుగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *