టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad)పై ప్రస్తుతం సోషల్ మీడియా, బహిరంగంగానూ తీవ్ర విమర్శలు(Criticisms) వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం లేకపోలేదు. ఆయన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్(Director SV Krishna Reddy Birthday Celebrations) సందర్భంగా ఇచ్చిన స్పీచ్ శ్రుతి మించడమే. తాజాగా ఆ వ్యాఖ్యలపై కమెడియన్ అలీ(Comedian Ali) స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ కావాలని అలా మాట్లాడలేదని, తమ మంచి సాన్నిహిత్యం ఉందని అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ను అలీ వెనకేసుకురావడమే కాకుండా మీడియా(Media)కు ఓ విజ్ఞప్తి చేశారు.
రాజేంద్ర ప్రసాద్ గారికి మాట తూలింది..
తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై కమెడియన్ అలీ ఈ విధంగా స్పందించారు. “కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారికి మాట తూలింది. ఆయన సరదాగా అన్నారు. దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదు” అని అలీ అన్నారు. రాజేంద్రప్రసాద్ మంచి కళాకారుడని, ప్రస్తుతం ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారని కూడా అలీ చెప్పారు. ఆయన కుమార్తె గాయత్రి(Gayatri) గతేడాది (2024 అక్టోబర్ 5న) మరణించిన విషయాన్ని అలీ గుర్తు చేశారు. ‘‘ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. ఆయన భావోద్వేగ స్థితిలో ఉన్నారు. ఆయన మానసిక స్థితిని అందరూ అర్థం చేసుకోవాలి” అని కోరారు.
#ComedianAli opens up about #RajendraPrasad pic.twitter.com/TbDMstNqvV
— KLAPBOARD (@klapboardpost) June 2, 2025
అలీనే కాదు రోజాని కూడా కించపర్చేలా వ్యాఖ్యలు
ఇంతకీ రాజేంద్రప్రసాద్ ఏమన్నారంటే.. ఆయన గతంలో సినిమా తీసే సమయంలో చేసిన అనుభవాలను వేదికపై గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అలీతో తనకు ఉన్న స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని ఆయన కాస్త తీవ్ర పదజాలం (లం****) ఉపయోగించి మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా(RK Roja)ను కూడా అసభ్య పదజాలంతో సంబోధించారు. ‘‘దాన్ని (రోజా) సినిమాల్లోకి తీసుకువచ్చింది కూడా నేనే’’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలకు రోజా నవ్వులు చిందించింది. కానీ వేదిక మీద ఒక మహిళను అలా కించపర్చేలా మాట్లాడటం రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడుకి తగదని అభిమానులు అంటున్నారు. కాగా గతంలో రాజేంద్రప్రసాద్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner)ని కూడా ‘అరే వార్నరూ’ అని సంబోధించిన విషయం తెలిసిందే.






