బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) మాజీ పర్సనల్ అసిస్టెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ.77 లక్షల మోసానికి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 2021–2024 మధ్య కాలంలో ఆలియా భట్‌కు వేదిక ప్రకాశ్ శెట్టి అనే యువతి అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆ సమయంలో అలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసింది. ఆలియాకు నటికి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్‌లను చూసుకునేది. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే ఫేక్ బిల్స్ సృష్టించి అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడింది.
ఫేక్ బిల్స్ రూపొందించి..
వేదిక తమను మోసం చేసిందని ఆలియా తల్లి, నటి, దర్శకురాలు సోనీ రజ్దాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీటింగ్ కేసు కింద వేదికను అరెస్ట్ చేశారు. ఫేక్ బిల్స్ రూపొందించి అలియాతో సంతకాలు చేయించి డబ్బును నొక్కేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అలియా సంతకం చేసిన తర్వాత ఈ మొత్తాన్ని తన ఫ్రెండ్స్ అకౌంట్‌కు పంచుకునేదని, ఆ తర్వాత వినియోగించేదని పోలీసులు తెలిపారు. కొంతకాలంగా పరారీలో ఉన్న వేదిక.. రాజస్థాన్, కర్ణాటక, పూణెల్లో తిరిగింది. చివరకు బెంగళూరులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ముంబయికి తీసుకెళ్లారు.
Alia Bhatt’s Ex Manager Vedika Prakash Shetty arrested from Bengaluru for allegedly cheating the actress of ₹77 Lakh by forging her signature #AliaBhatt #vedikashetty #vedikaprakashshetty #fraud #bollywood #bollywoodnews #entertainment #entertainmentindustry #EntertainmentNews pic.twitter.com/dIkuAiQv0h
— Manchh (@Manchh_Official) July 9, 2025






