
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు(Intermediate exams) షురూ కానున్నాయి. ఇవాళ్టి నుంచి (మార్చి 5) ఈ నెల 25వరకూ కొనసాగనున్నాయి. ఈ మేరకు బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, గురువారం ఇంటర్ సెంకడియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాల(Exam Centers)ను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావొద్దు..
ఇక ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్(First Year Exams)కు 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. సెకండియర్(Second)లో 5,08,523 విద్యార్థుల చొప్పున హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్‌లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు(Electronic devices) తీసుకురావొద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పరీక్షా కేంద్రాల్లో CC కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులు(Students) ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
కాగా పరీక్షల కోసం 29,992 మంది ఇన్విజిలెటర్లు(Invigilators), 72 మంది ప్లయింగ్‌స్కాడ్స్(Flying Squads), 124 సిట్టింగ్ స్కాడ్‌లను నియమించింది. విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్టేట్ కంట్రోల్ రూమ్ 90402-05555 నంబర్‌కు ఫోన్ చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య(Inter Board Secretary Krishna Aditya) వెల్లడించారు. విద్యార్థులు పరీక్షల భయంతో మానసికంగా ఇబ్బందులకు గురైతే టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.