ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదరుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) పేరిట మరో ధనాధన్ క్రికెట్ టోర్నీ నేడు (మార్చి 22) ప్రారంభం కానుంది. దీంతో దాదాపు రెండు నెలల పాటు మండుటెండలోనూ అభిమానులు ఫోర్లు, సిక్సర్ల వర్షంతో తడిసి ముద్దవనున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 గంటలకు డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనుంది. కాగా ఈసీజన్ కాస్త స్పెషల్‌గా ఉండనుంది. ఎందుకంటే మినీ వేలం ద్వారా ఆయా జట్లలోని పలువురు ప్లేయర్లు ఇతర జట్లకు వెళ్లారు. దీంతో ఇతర జట్లలో వారి ప్రదర్శన ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది.
)
అదిరిపోయేలా ఆరంభ వేడుకలు
ఇక ఇవాళ్టి మ్యాచ్‌కి సంబంధించి ఇరు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) వెళ్లిపోవడంతో అజింక్యా రహానే(Ajinkya Rahane) కేకేఆర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక RCBకి రజత్ పాటీదార్ (Rajat Patidar) నాయకత్వం వహించనున్నాడు. అలాగే ఇరు జట్లలోకి పలువురు కొత్త ప్లేయర్లు వచ్చారు. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందు ఆరంభ వేడుకలు జరగనున్నాయి.

బాలీవుడ్ బామ దిశా పటానీ(Disha Patani) తళుక్కుమననుంది. సింగర్లు శ్రేయా గోషల్(Shreya Goshal), పంజాబీ సింగర్ కరణ్ ఔజిలా తమ ఆట పాటలతో సందడి చేయనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మ్యాచుకు వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.






